STOCKS

News


6,700 యూనిట్లకు క్లియరెన్సులు ఇచ్చాం

Friday 10th August 2018
news_main1533896578.png-19127

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇప్పటి వరకు 6,700 యూనిట్లకు క్లియరెన్సులు ఇచ్చామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం వెల్లడించారు. వీటి ద్వారా రూ.1,36,000 కోట్ల పెట్టుబడులను ఆకర్శించామని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. పరోక్షంగా మరో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల విస్తరణకు తోడ్పాటు అందిస్తున్నట్టు చెప్పారు. ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ ద్వారా ఖాయిలా పడ్డ యూనిట్లను తెరిచేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నట్టు తెలిపారు. 
ఎస్‌ఎంఈలకు చేయూతనివ్వండి..
ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీ) దక్షిణ ప్రాంత మండలి తొలి సమావేశానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిన్న, మధ్యతరహా (ఎస్‌ఎంఈ) కంపెనీలకు చేయూతనివ్వాల్సిందిగా ఐసీసీ ప్రతినిధులను కోరారు. రానున్న రోజుల్లో ఎస్‌ఎంఈలే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించనున్నాయని అన్నారు. మంచి వ్యాపార ఆలోచన ఉండి కూడా మెంటార్‌షిప్‌ లేక విఫలమైన కంపెనీలు ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకుంటామని ఐసీసీ దక్షిణ ప్రాంత మండలి చైర్మన్‌ రాజీవ్‌ రెడ్డి తెలిపారు. సమావేశంలో ఐసీసీ ప్రెసిడెంట్‌ శాశ్వత్‌ గోయెంకా, చాంబర్‌ ప్రతినిధులు మయంక్‌ జలాన్‌, రాజీవ్‌ సింగ్‌ పాల్గొన్నారు.
 



You may be interested

రికార్డుల ర్యాలీకి బ్రేక్‌

Friday 10th August 2018

38వేల దిగువకు సెన్సెక్స్‌ 11450 మార్కును కోల్పోయిన నిఫ్టీ స్టాక్‌ మార్కెట్లో సూచీల రికార్డుల పరంపరకు శుక్రవారం బ్రేకులు పడ్డాయి. గత రెండు రోజుల నుంచి దలాల్‌ స్ట్రీల్‌లో హల్‌చల్‌ చేస్తున్న బుల్స్‌ నేటి ట్రేడింగ్‌లో లాభాల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 155 పాయింట్ల నష్టపోయి 37,869 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 41.20 పాయింట్లు నష్టపోయి 11,429.50ల వద్ద ముగిశాయి. గత ట్రేడింగ్‌ సెషన్లలో భారీ లాభాలు ఆర్జించిన ప్రభుత్వరంగ

రికవరీ బాటలో పీఎస్‌బీలు

Friday 10th August 2018

ముంబై: మొండి బాకీల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) క్రమంగా రికవరీ బాట పడుతున్నాయి. బాకీలు రాబట్టుకునేందుకు అవి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయా బ్యాంకులు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఉదాహరణకు నీరవ్‌ మోదీ కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో స్థూలంగా రూ. 7,700 కోట్ల బాకీలను రికవర్‌ చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద

Most from this category