STOCKS

News


టెక్‌ మహీంద్రా లాభం రూ.1,203 కోట్లు

Wednesday 6th February 2019
news_main1549430863.png-24043

-15 శాతం వృద్ధితో రూ.8,944 కోట్లకు మొత్తం ఆదాయం
-21 శాతం పెరిగిన ఎబిటా
-భవష్యత్తులో మార్జిన్లపై ఒత్తిడి

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,203 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.9,43 కోట్ల నికర లాభం వచ్చిందని, 28 శాతం వృద్ధి సాధించామని టెక్‌ మహీంద్రా తెలిపింది. ఆటోమేషన్‌ కారణంగా లాభ మార్జిన్‌ పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సి. పి. గుర్నాని పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.7,776 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో  రూ.8,944 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఎబిటా 21 శాతం పెరిగి రూ.1,803 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నిర్వహణ మార్జిన్‌ 50 బేసిస్‌ పాయింట్లు పెరిగి 19.3 శాతానికి చేరిందని వివరించారు.

ఏడో క్వార్టర్‌లోనూ పెరిగిన మార్జిన్‌...
లాభ మార్జిన్‌ పెరగడం ఇది వరుసగా ఏడో క్వార్టర్‌ అని, అయితే గతంలో పెరిగినట్లుగా లాభ మార్జిన్ల పెరుగుదల లేదని కార్పొరేట్‌ స్ట్రాటజీ చీఫ్‌  మనోజ్‌ భట్‌  పేర్కొన్నారు.  వేతన వ్యయం పెరుగుతుండటం, పెట్టుబడులు కూడా అధికం కానుండటంతో భవిష్యత్తులో కూడా మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతుందని, మార్జిన్లు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని  వివరించారు.

మైలురాయి త్రైమాసికం...
 అన్ని అంశాల్లో చెప్పుకోదగ్గ మెరుగుదలను సాధించామని, టెక్‌ మహీంద్రాకు ఇది మైలురాయి త్రైమాసికమని  సి. పి. గుర్నాని వ్యాఖ్యానించారు. ఎంటర్‌ప్రైజ్‌, కమ్యూనికేషన్‌ విభాగాల్లో మంచి వృద్ధి సాధించామని, 500 కోట్ల డాలర్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జించబోతున్నామని పేర్కొన్నారు. ఈ డిసెంబర్‌ క్వార్టర్‌లో నికరంగా 3,451 ఉద్యోగాలు ఇచ్చామని,  మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,21,842కు పెరిగిందని తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి నగదు. నగదు సమానమైన నిల్వలు 125 కోట్ల డాలర్లుగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఆదాయానికి 5జీ జోష్‌..
ఈ ఏడాది చివరినాటికి 5జీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని, దీంతో తమ టెలికం విభాగం మంచి వృద్ధిని సాధించగలదని గుర్నానీ పేర్కొన్నారు. ఈ దన్నుతో వచ్చే ఆర్థిక సంవత్సరం జూలై క్వార్టర్‌ నుంచి తమ ఆదాయం పెరుగుతుందని వివరించారు.You may be interested

భెల్‌ లాభం 25శాతం అప్‌

Wednesday 6th February 2019

25 శాతం పెరిగిన భెల్‌ లాభం ఒక్కో షేర్‌కు 80 పైసల మధ్యంతర డివిడెండ్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ సంస్థ, భెల్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌-డిసెంబర్‌ క్వార్టర్లో 25 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.153 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.192 కోట్లకు పెరిగిందని భెల్‌ తెలిపింది. ఆదాయం రూ.6,666 కోట్ల నుంచి 10 శాతం ఎగసి రూ.7,336 కోట్లకు పెరిగిందని భెల్‌

పీఎన్‌బీ.. మళ్లీ లాభాల్లోకి..!

Wednesday 6th February 2019

- క్యూ3లో రూ. 247 కోట్లు - 7 శాతం వృద్ధి - మొండిబాకీలకు తగ్గిన కేటాయింపులు న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణం దెబ్బతో వరుసగా మూడు త్రైమాసికాల పాటు భారీ నష్టాలు ప్రకటిస్తూ వచ్చిన ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మొత్తానికి మళ్లీ లాభాల బాట పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 247 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో

Most from this category