STOCKS

News


టెక్‌ మహీంద్రా లాభం రూ.1064 కోట్లు

Wednesday 31st October 2018
news_main1540973063.png-21611

  • 27 శాతం వృద్ధి
  • కలసివచ్చిన రూపాయి పతనం
  • 13 శాతం వృద్ధితో రూ.8,630 కోట్లకు ఆదాయం

న్యూఢిల్లీ: టెక్‌ మహీంద్రా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,064 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.836 కోట్లు నికర లాభం వచ్చిందని, 27 శాతం వృద్ధి సాధించామని టెక్‌ మహీంద్రా తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే నికర లాభం 19 శాతం పెరిగింది. రూపాయి పతనం ప్రధాన కారణంగా మార్జిన్లు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని టెక్‌ మహీంద్రా సీఈఓ, ఎమ్‌డీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు. గత క్యూ2లో రూ.7,606 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో 13 శాతం వృద్ధితో రూ.8,630 కోట్లకు పెరిగిందని తెలిపారు. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, ఆదాయ వృద్ధి 4 శాతమే పెరిగిందని, హెల్త్‌కేర్‌ సెగ్మెంట్‌ మందకొడి పనితీరే దీనికి కారణమని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 16 శాతం వృద్ధితో 15 కోట్ల డాలర్లకు, ఆదాయం 3 శాతం వృద్ధితో 121 కోట్ల డాలర్లకు పెరిగాయని చెప్పారు. ఎబిటా  46 శాతం (సీక్వెన్షియల్‌గా చూస్తే 19 శాతం)  పెరిగి రూ.1,619 కోట్లకు పెరిగిందని,  ఎబిటా మార్జిన్‌ 4.3 శాతం పెరిగి 18.8 శాతానికి చేరాయని వివరించారు.

ఫలితాలు సంతృప్తికరం...
ఈ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని గుర్నానీ తెలిపారు. డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌పై దృష్టి సారించడం వల్ల మంచి పనితీరు సాధించామని వివరించారు. కమ్యూనికేషన్‌ విభాగంలో మంచి డీల్స్‌ పొందామని, సీక్వెన్షియల్‌గా చూస్తే, డిజిటల్‌ విభాగం ఆదాయం 10 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఎబిటా మార్జిన్‌, ఆదాయాల్లో మంచి వృద్ధి సాధించామని వివరించారు. ఈ క్యూ2లో 55 కోట్ల డాలర్ల డీల్స్‌ను ఈ కంపెనీ సాధించింది. ఒక్క క్వార్టర్‌లో ఈ స్థాయిలో డీల్స్‌ సాధించడం ఈ కంపెనీకి ఇదే మొదటిసారి.
రూ.7,900 కోట్ల నగదు నిల్వలు..
నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.7,900 కోట్లుగా ఉన్నాయని గుర్నాని పేర్కొన్నారు. యాక్టివ్‌ క్లయింట్ల సంఖ్య 930కు పెరిగిందని వివరించారు. ఈ సెప్టెంబర్‌ క్వార్టర్లో 4,839 కొత్త ఉద్యోగాలు ఇచ్చామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.18 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. వీరిలో 72,534 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులని, 39,407 మంది బీపీఓ ఉద్యోగులని వివరించారు. ఈ క్యూ1లో 19 శాతంగా ఉన్న ఆట్రీషన్‌ రేటు ఈ క్యూ2లో 20 శాతానికి పెరిగింది.



You may be interested

కేంద్రం ప్రకటనతో సూచీలు టర్న్‌ఎరౌండ్‌

Wednesday 31st October 2018

ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం బుధవారం మధ్యాహ్న సమయంలో చేసిన ప్రకటనతో స్టాక్‌ సూచీలు వేగంగా కోలుకున్నాయి. మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 250 పాయింట్ల పెరుగుదలతో 34,140 పాయింట్ల వద్దకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 85 పాయింట్లు ర్యాలీ జరిపి 10,283 పాయింట్ల వద్దకు చేరాయి. కే ంద్ర ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి తీవ్ర విబేధాలు తలెత్తాయని వచ్చిన వార్తలతో బుధవారం ఉదయం 10–11 గంటల

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా భేష్‌

Wednesday 31st October 2018

-20 శాతం వృద్ధి -మెరుగుపడిన రుణ నాణ్యత -8 శాతం వృద్ధితో రూ.13,430 కోట్లకు మొత్తం ఆదాయం ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా  ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌లో రూ.425 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.355 కోట్ల నికర లాభం వచ్చిందని 20 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. మొండి బకాయిల పరిస్థితి మెరుగుపడటంతో నికర లాభం ఈ

Most from this category