News


గ్రూపు కంపెనీల మధ్య మరింత సహకారం అవసరం

Friday 14th June 2019
news_main1560494652.png-26288

  • గ్రూపు కంపెనీల మధ్య మరింత సహకారం అవసరం
  • కలసి పనిచేయాల్సిన అవసరం, అవకాశాలు
  • టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌

ముంబై: భారీ సంఖ్యలో ఉన్న టాటా గ్రూపు కంపెనీల మధ్య మరింత సహకారం అవసరమని ఆ గ్రూపు చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘గ్రూపు కంపెనీలు కలసి పనిచేసే విషయంలో కొంత మెరుగుదల అయితే ఉంది. అయితే, ఇంకా ఎంతో మెరుగుపడాలి. మరింత సహకరించుకోవాల్సిన అవసరం, అవకాశాలు ఉన్నాయి’’ అని అన్నారు. టాటా గ్రూపు ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన టీసీఎస్‌ వాటాదారుల వార్షిక సమావేశం (ఏజీఎం) గురువారం జరగ్గా, వాటాదారులను ఉద్దేశించి చంద్రశేఖరన్‌ ప్రసగించారు. 2017 ఫిబ్రవరిలో టాటా సన్స్‌ చైర్మన్‌ బాధ్యతల్లోకి అడుగుపెట్టిన చంద్రశేఖరన్‌, ఆ తర్వాత వందల సంఖ్యలో ఉన్న గ్రూపు కంపెనీల మధ్య ఏకీరణ, సమన్వయం దిశగా ప్రణాళికలను అమల్లో పెట్టారు. నీటి వినియోగాన్ని, అదే విధంగా కార్బన్‌ డైఆక్సైడ్‌ విడుదలను తగ్గించే విషయంలో సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నట్టు చంద్రశేఖరన్‌ తెలిపారు. రూ.కోటి అంతకంటే ఎక్కువ వేతనం తీసుకునే ఉద్యోగుల సంఖ్య పెరిగిపోవడంపై వాటాదారుల నుంచి ప్రశ్నలు ఎదురుకాగా... టీసీఎస్‌లో సీనియర్‌ ఉద్యోగులకు ఇంకా ఎక్కువే వేతనాలను చెల్లించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. టీసీఎస్‌ ఆదాయంలో ఉద్యోగుల ఖర్చు 53 శాతమేనని, ఇతర పోటీ సంస్థలతో పోలిస్తే ఇది చాలా తక్కువన్న విషయాన్ని వివరించారు. 
మహిళలకు సుముచిత ప్రాధాన్యం...
టీసీఎస్‌ బోర్డులో మహిళలకు తగినంత ప్రాతినిధ్యం ఉన్నట్టు ఎన్‌ చంద్రశేఖరన్‌ చెప్పారు. 4 లక్షల మంది ఉద్యోగుల్లో 36 శాతం మంది మహిళలేనన్నారు. యాజమాన్యంలో మరింత వైవిధ్యం అవసరమన్నారు. లోక్‌సభలో ప్రాతినిధ్యం ఆధారంగానే రాజకీయ పార్టీలకు విరాశాలు ఇచ్చినట్టు చెప్పారు. ఇటీవల ముగిసిన ఎన్నికల ముందు పార్టీలకు అన్నింటికీ కలిపి టాటా గ్రూపు రూ.600 కోట్లను విరాళంగా ఇచ్చింది. ఇందులో ఒక్క టీసీఎస్‌ వాటాయే రూ.220కోట్లు. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన విరాళాలతో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ. నూతన టెక్నాలజీలకు సంబంధించి కంపెనీకి వేలాది పేటెంట్లు ఉన్నాయని, వీటికి లైసెన్స్‌లు తీసుకునే ఆలోచన ఇప్పుడు లేదన్నారు. డిజిటల్‌ సేవల ఆదాయం వార్షికంగా 50 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని, 2019 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం 20 బిలియన్‌ డాలర్లలో 6 బిలియన్‌ డాలర్లు డిజిటల్‌ రూపంలో వచ్చినదేనని టీసీఎస్‌ ఎండీ, సీఈవో రాజేష్‌ గోపినాథన్‌ తెలిపారు. 



You may be interested

ఇండియాబుల్స్‌ పై పిటీషన్‌ వెనక్కి

Friday 14th June 2019

ముంబై: ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(ఐబీహెచ్‌ఎఫ్‌)కు గురువారం భారీ ఊరట లభించింది. ఈ కంపెనీలో రూ.98,000 కోట్ల మేర అవకతవకలు జరిగాయని, దీనిపై విచారణ చేయాలంటూ సుప్రీం కోర్ట్‌లో అభయ్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఒక పిటీషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్‌ను గురువారం నాడు అభయ్‌ యాదవ్‌ ఉపసంహరించుకున్నాడు. పిటీషన్‌లో పేర్కొన్న ఆరోపణలు, ఫిర్యాదులు తనకు తెలియవని, తాను సంతకం చేసిన డాక్యుమెంట్లను దుర్వినియోగం చేసి కంపెనీకి

ఆరు క్వార్టర్ల కనిష్ఠానికి ఆదాయం

Friday 14th June 2019

సెంటిమెంట్‌ బలహీనం అంతంమాత్రంగానే డిమాండ్‌ మెరుగుపడిన మార్జిన్లు: ఇక్రా ముంబై: భారత కంపెనీల ఆదాయాలు గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ కంపెనీల ఆదాయ వృద్ధి పది శాతంగానే ఉందని, ఇది ఆరు క్వార్టర్ల కనిష్ట స్థాయి అని ఇక్రా తాజా నివేదిక పేర్కొంది. ఈ రేటింగ్‌ ఏజెన్సీ, వివిధ రంగాల నుంచి కొన్ని కంపెనీల ఆర్థిక ఫలితాలను విశ్లేషించి ఈ నివేదికను  రూపొందించింది. వినియోగదారుల సెంటిమెంట్స్‌ బలహీనంగా ఉండటం,

Most from this category