STOCKS

News


టీసీఎస్‌ ఫలితాలు.. ఎలా ఉండొచ్చు?

Tuesday 9th October 2018
news_main1539083233.png-20984

భారత ఐటీ దిగ్గజం టీసీఎస్‌ తన క్యు2 ఫలితాలను గురువారం ప్రకటించనుంది. దీంతో దేశీయ కార్పొరేట్‌ ప్రపంచంలో ఫలితాల సందడి షురూ కానుంది. భారీగా పతనమైన మార్కెట్లకు ఫలితాలు కొత్త ఆశలు ఇస్తాయని ఇన్వెస్టర్లు ఆశగా ఉన్నారు. టీసీఎస్‌ ఫలితాల విషయానికి వస్తే రూపీ క్షీణతతో కంపెనీ ఎబిటా మార్జిన్లు భారీగా మెరుగుపడి ఉంటాయని మెజార్టీ బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. 
కంపెనీ ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలు..
- ఐడీబీఐ క్యాపిటల్‌: టీసీఎస్‌ నికరలాభంలో 9.10 శాతం పెరుగుదల ఉండొచ్చు. ఎబిటా మార్జిన్లు 14.20 శాతం విస్తరించవచ్చు. ఆదాయంలో 6.7 శాతం వృద్ధి ఉండవచ్చు. ఎబిటా మార్జిన్లపై అవుట్‌లుక్‌, పెద్ద డీల్స్‌, కొత్త క్లయింట్ల వివరాలను పరిశీలించవచ్చు.
- ప్రభుదాస్‌ లీలాధర్‌: అక్యుములేట్‌ రేటింగ్‌ ఇచ్చింది. వాల్యూషన్లు కొంచెం అధికంగానే ఉన్నాయని, వీటినిక న్యాయం జరిగేలా ఫలితాలు ఉండాలని అభిప్రాయపడింది. రెవెన్యూలో 3.5 శాతం పెరుగుదల ఉండొచ్చు. యూఎస్‌డీ రెవెన్యూలు 2.2 శాతం మేర పెరుగుతాయని అంచనా. బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో వ్యాపారం ఎలా ఉందనేది నిశితంగా పరిశీలించాలి. 
- ఎడెల్‌వీజ్‌: రెవెన్యూలో 6.8 శాతం, లాభంలో 9.3 శాతం, ఎబిటాలో 13.8 శాతం వృద్ది ఉంటుంది. రూపీ క్షీణత ఉన్నా అదే సమయంలో యూరో, పౌండ్‌, ఆస్ట్రేలియన్‌ డాలర్‌ సైతం పతనం కావడంతో రెవెన్యూ వృద్ధిలో 120 బీపీఎస్‌ మేర కోత కనిపించవచ్చు. వేతనాల పెంపుదల ప్రభావం సైతం కనిపిస్తుంది. మేనేజ్‌మెంట్‌ వ్యాఖ్యానాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిఉంది. 



You may be interested

ఈ ఏడాది బాగా చితక్కొట్టుడు ఈ షేర్లకే...

Wednesday 10th October 2018

స్టాక్‌ మార్కెట్లకు 2018 బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే భారీ అస్థిరతలకు తోడు బలమైన బ్లూచిప్‌ షేర్లకు కూడా వరుసపెట్టి బాదుడు తప్పలేదు. పేరున్న కంపెనీల మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ఎన్నో కారణాలతో ఇన్వెస్టర్ల సంపదను భారీగా కాలరాసేసిన షేర్ల వివరాలు (రూ.5 వేల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ కంటే ఎక్కువ ఉండి నష్టపోయినవి) చూస్తే...    పీఎన్‌బీ: 2017 డిసెంబర్‌లో మార్కెట్‌ క్యాప్‌ రూ.41,599 కోట్లు.

ఈ షేర్లలో ఎంఏసీడీ పాజిటివ్‌ క్రాసోవర్‌

Tuesday 9th October 2018

సోమవారం ముగింపు ప్రకారం 15 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో టైటాన్‌, తల్వాకర్స్‌, భన్సాలీ ఇంజనీరింగ్‌, ఏస్టర్‌, గుజరాత్‌ పిప్‌వావ్‌, వైస్రాయ్‌ హోటల్స్‌, తైజారియా, మొరార్జి, టేక్‌ సొల్యూషన్స్‌, గోకుల్‌ ఆగ్రో తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ,

Most from this category