STOCKS

News


పోస్టాఫీసుల ఆధునీకరణ పూర్తి

Monday 22nd April 2019
news_main1555916487.png-25264

- ఐటీ దిగ్గజం టీసీఎస్ వెల్లడి

న్యూఢిల్లీ: మరిన్ని సేవలు, మరింత మెరుగ్గా అందించేలా దేశవ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల పైచిలుకు పోస్టాఫీసుల ఆధునీకరణ ప్రక్రియ పూర్తయినట్లు ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) వెల్లడించింది. ఇండియా పోస్ట్ నుంచి 2013లో దక్కించుకున్న కాంట్రాక్టులో భాగంగా దీన్ని పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈ డీల్‌ విలువ రూ. 1,100 కోట్లు. కాంట్రాక్టు ప్రకారం.. మానవ వనరులు, ఫైనాన్స్‌, అకౌంటింగ్‌ తదితర విభాగాల కార్యకలాపాలను అనుసంధానం చేసే కోర్‌ సిస్టమ్ ఇంటిగ్రేషన్ (సీఎస్‌ఐ) ప్రోగ్రాంను అమలు చేసినట్లు టీసీఎస్ తెలిపింది. ఇది అయిదు లక్షల పైచిలుకు ఉద్యోగులకు తోడ్పాటు అందించేదిగాను, రోజుకి ముప్ఫై లక్షల పైచిలుకు లావాదేవీల నిర్వహణ మొదలైన వాటికి ఉపయోగపడేదిగాను ఉందని పేర్కొంది. 24,000 పైచిలుకు పోస్టాఫీసుల్లో 80,000 పైగా పాయింట్‌ ఆఫ్ సేల్స్ (పీవోఎస్‌) టెర్మినల్స్‌కు అవసరమైన సొల్యూషన్స్ అందించినట్లు, వినియోగదారుల సేవలకు సంబంధించి వివిధ భాషల్లో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు టీసీఎస్‌ వివరించింది.



You may be interested

ఆర్థికంగా వెలిగిపోదాం...

Monday 22nd April 2019

ప్రారంభంలోనే ప్రణాళిక రూపకల్పన  ఏప్రిల్‌ నుంచే ఆచరణలోకి ఏడాది చివర్లో ఆదుర్దా ఉండదు పన్ను ఆదాకు ఈఎల్‌ఎస్‌ఎస్‌లో సిప్‌  విశ్రాంత జీవనం కోసం ఎన్‌పీఎస్‌ వీపీఎఫ్‌ ద్వారా పన్ను లేని రాబడులు నూతన ఆర్థిక సంవత్సరం 2019-20లోకి ప్రవేశించి రెండు వారాలు గడిచిపోయింది. ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ, వ్యయాలకు తోడు పన్ను బాధ్యతలు ఎదురవుతుంటాయి. ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఓ ప్రణాళిక రూపొందించుకుని దానిని ఆచరణలో పెడితే ఒడిదుడుకులు లేకుండా సాఫీగా జీవనం కొనసాగించేందుకు అవకాశం

జెట్‌కు ఐబీసీ వెలుపలే పరిష్కారం

Monday 22nd April 2019

రుణదాతల యోచన బిడ్డింగ్‌ విజయవంతం అవుతుందన్న ఆశాభావం న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ బిడ్డింగ్‌ ప్రక్రియ సఫలం కాకపోతే, ఈ సమస్యను ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ)కు వెలుపలే పరిష్కరించుకోవాలన్న యోచనతో బ్యాంకులు ఉన్నాయి. జెట్‌కు రూ.8,500 కోట్లకు పైగా రుణాలు ఇచ్చి, వాటి వసూలు కోసం సంస్థను ఆధీనంలోకి తీసుకున్న ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ... సంస్థను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. సంస్థకు అత్యవసంగా అవసరమైన నిధులను సైతం

Most from this category