STOCKS

News


టీసీఎస్‌ ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలు

Wednesday 9th January 2019
news_main1547023919.png-23485

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌ జనవరి 10న మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా కంపెనీ  బలమైన ఫలితాలనే ప్రకటించవచ్చని బ్రోకరింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. కంపెనీ మొత్తం ఆర్థిక సంవత్సరానికి రెండంకెల వృద్దిని నమోదు చేయవచ్చని, రెవెన్యూ గ్రోత్‌ 1.4- 2.2 శాతం(స్థిర కరెన్సీలెక్కల్లో) ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. 
- గత త్రైమాసికంతో పోలిస్తే రెవెన్యూలో 1.8 శాతం వృద్ది ఉంటుంది- జెఫర్రీస్‌
- ఈ త్రైమాసికంలో ఆర్థిక సంవత్సరం మొత్తంలో గరిష్ఠ వృద్ది ఉంటుంది. డిజిటల్‌ వ్యాపారం అత్యంత కీలకంగా మారింది.- ఎడెల్‌వీజ్‌
-  డాలర్‌ లెక్కల్లో వృద్ధి 0.7 శాతం ఉండొచ్చు. బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్‌ వ్యాపారాలు బాగా కొనసాగుతున్నాయి. తాజాగా కుదుర్చుకున్న డీల్స్‌తో రెవెన్యూ వృద్ధి బాగుంటుంది.- మోతీలాల్‌ఓస్వాల్‌.
- ఎబిటా వృద్ధి, మార్జిన్లు ఫ్లాట్‌గా ఉంటాయి. రూపీ క్షీణత వల్ల కలిగిన ప్రయోజనాలు సమర్ధులైన వర్క్‌ఫోర్స్‌ ఏర్పరుచుకునేందుకు ఉపయోగించుకోవచ్చు.- ఎమ్‌కే
- నికర ఆదాయంలో 3.2 శాతం వృద్ది ఉంటుంది. - ఫిలిప్‌ క్యాపిటల్‌
- ఇతర ఆదాయాల్లో క్షీణత, పన్ను ఆదాయాల్లో మెరుగుదల ఉండవచ్చు. - సీఐఎంబీ
ఫలితాల్లో ఏం చూడాలి?
1. మొత్తం గ్లోబల్‌ డిమాండ్‌ అవుట్‌లుక్‌పై కామెంట్‌.
2. ఐటీ బడ్జెట్లపై మేనేజ్‌మెంట్‌ కామెంటరీ.
3. డిజిటల్‌ సర్వీస్‌ వ్యయాల్లో(ముఖ్యంగా బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్‌, యూఎస్‌, యూకే) వృద్ధి అంచనాలు
4. రిక్రూట్‌మెంట్లు, ఎంఅండ్‌ఏ ప్లాన్లు.
5. వచ్చే ఏడాదికి మార్జిన్‌ అంచనాలు.



You may be interested

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాభం రూ. 985 కోట్లు

Wednesday 9th January 2019

మూడోత్రైమాసికంలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ లాభం 5 శాతం పెరిగి రూ. 985 కోట్లకు చేరింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు సంబంధించిన అధిక కేటాయింపులు బ్యాంకు లాభాలను దెబ్బతీశాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంకు 936 కోట్ల రూపాయల నికరలాభం నమోదు చేసింది. ప్రస్తుత త్రైమాసికంలో బ్యాంకు లాభం ర. 811 కోట్లు ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. తాజా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 21 శాతం

జీవితకాల గరిష్టానికి ఐసీఐసీఐ

Wednesday 9th January 2019

ఐసీఐసీఐ బ్యాంకు షేరు బుధవారం కొత్త జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది. బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ షేరు టార్గెట్‌ ధరను పెంచడం ఇందుకు తోడ్పాటును అందించింది. బ్యాంకు ఆస్తుల నాణ్యతో పాటు, ఆదాయాలు క్రమంగా వృద్ధి చెందాయి. కావున షేరు టార్గెట్‌ ధరను రూ.460ల నుంచి రూ.510లకు పెంచుతున్నాయి. అలాగే ఇదివరకు షేరుకు కేటాయించిన అండర్‌ వెయిట్‌ రేటింగ్‌ను యథాతధంగా కొనసాగిస్తున్నామని మోర్గాన్‌ స్టాన్లీ తన నివేదికలో

Most from this category