STOCKS

News


హెచ్‌-1బీ వీసాల టాప్‌ 10లో టీసీఎస్‌

Wednesday 24th October 2018
news_main1540360513.png-21427

వాషింగ్టన్‌: అమెరికా హెచ్‌-1బీ వీసాలకు సంబంధించి ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ పొందిన టాప్ 10 కంపెనీల్లో దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) చోటు దక్కించుకుంది. సెప్టెంబర్‌ 30తో ముగిసిన 2018 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ మొత్తం 20,755 హెచ్‌-1బీ లేబర్ సర్టిఫికేషన్స్ పొందింది. 1,51,164 సర్టిఫికేషన్స్‌తో ప్రొఫెషనల్ సర్వీసెస్ దిగ్గజం ఎర్న్‌స్ట్‌ అండ్ యంగ్ అగ్ర స్థానంలో ఉన్నట్లు అమెరికా కార్మిక శాఖ ఒక నివేదికలో తెలియజేసింది. టాప్ 10లో చోటు దక్కించుకున్న సంస్థల్లో ఇండియా నుంచి టీసీఎస్‌ ఒక్కటే ఉండటం విశేషం. మిగతా సంస్థల్లో డెలాయిట్‌, కాగ్నిజెంట్‌, హెచ్‌సీఎల్ అమెరికా, కె ఫోర్స్‌, యాపిల్ తదితర సంస్థలున్నాయి. విదేశీ నిపుణులు తమ దేశంలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు అమెరికా హెచ్‌-1బీ వీసా జారీ చేస్తుంది. తమ ఉద్యోగుల కోసం ఈ వీసాలు తీసుకోవాలంటే అమెరికా కార్మిక శాఖకు కంపెనీలు లేబర్ కండీషన్ అప్లికేషన్ సమర్పించాలి. సదరు ఉద్యోగికి ఆఫర్ చేస్తున్న హోదా, జీతభత్యాలు, కాల వ్యవధి తదితర అంశాలు ఇందులో ఉంటాయి. దీన్ని ఆమోదిస్తూ కార్మిక శాఖ సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాతే హెచ్‌-1బీ కోసం దరఖాస్తు చేసుకోగలుగుతారు.



You may be interested

బజాజ్‌ ఫైనాన్స్‌కు లాభాల బూస్ట్‌

Wednesday 24th October 2018

ముంబై: నిర్వహణలోని ఆస్తుల్లో చక్కని వృద్ధి సాధించటంతో బజాజ్‌ ఫైనాన్స్‌ కన్సాలిడేటెడ్‌ లాభం సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో ఏకంగా 54 శాతం పెరిగి రూ.923 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి వచ్చిన లాభం రూ.598 కోట్లు. కన్సాలిడేటెడ్‌ ఆదాయం సైతం 40 శాతం వృద్ధితో కిందటేడాది ఇదే కాలంలో ఉన్న రూ.3,066 కోట్ల నుంచి రూ.4,296 కోట్లకు వృద్ధి చెందింది. సబ్సిడరీ కంపెనీలైన బజాజ్‌

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాభం 36 శాతం అప్‌

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 36 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.151 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.205 కోట్లకు పెరిగిందని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తెలిపింది. వడ్డీ ఆదాయం బాగా  పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో వృద్ధి చెందిందని వివరించింది. అయితే కేటాయింపులు అధికంగా ఉండటం వల్ల లాభం తగ్గిందని వివరించింది.

Most from this category