STOCKS

News


వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ డీల్‌పై ఐటీ దృష్టి..

Wednesday 5th December 2018
news_main1543985032.png-22645

న్యూఢిల్లీ: దేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికన్ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన డీల్ విషయంలో పన్ను పరమైన అంశాలపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది. "వివిధ ఇన్వెస్టర్లకు వాల్‌మార్ట్ జరిపిన చెల్లింపులకు సంబంధించి మా దగ్గర పూర్తి వివరాలున్నాయి. కొన్ని కేసుల్లో పన్నులను మినహాయించుకుని చెల్లింపులు జరపగా, కొన్నింటిలో మాత్రం అలా జరగలేదు. ప్రస్తుతం వీటిని పరిశీలిస్తున్నాం. వీటిపై పన్ను ఎందుకు విధించరాదో వివరాలివ్వాలంటూ ఆయా ఇన్వెస్టర్లకు సూచించాం" అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సభ్యుడు అఖిలేష్ రంజన్ తెలిపారు. ఈ ఏడాది మే నెలలో 16 బిలియన్ డాలర్లు పెట్టి (సుమారు రూ. 1.05 లక్షల కోట్లు) ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ 77 శాతం వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సాఫ్ట్‌బ్యాంక్, నాస్పర్స్‌ తదితర ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు తమ వాటాలను విక్రయించాయి. మరోవైపు దాదాపు రూ. 10,247 కోట్ల పన్ను బకాయిలను రాబట్టుకునేందుకు కెయిర్న్ ఎనర్జీ నుంచి స్వాధీనం చేసుకున్న అన్ని షేర్లను రెవెన్యు విభాగం విక్రయించేసిందని రంజన్ చెప్పారు.



You may be interested

నోట్ల రద్దుతో పెరిగిన ఐటీ రిటర్నులు

Wednesday 5th December 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీ రిటర్న్స్‌) దాఖలు చేసిన వారి సంఖ్య 6.08 కోట్లకు పెరిగిందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం అధికమని, పెద్ద నోట్ల రద్దు ఇందుకు గణనీయంగా తోడ్పడిందని ఆయన వెల్లడించారు. "పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి

‘యస్‌’ బ్యాంకు నుంచి రెండు మ్యూచువల్‌ ఫండ్‌లు

Wednesday 5th December 2018

  న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని యస్‌ బ్యాంక్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ, యస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ త్వరలో రెండు మ్యూచువల్‌ ఫండ్స్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నుంచి ఆమోదం పొందినట్లు యస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ తెలియజేసింది. యస్‌ లిక్విడ్‌ ఫండ్‌, యస్‌ ఆల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్‌ల పేరుతో రెండు మ్యూచువల్‌ ఫండ్స్‌ స్కీమ్‌లను త్వరలో​‍అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. కాగా ప్రస్తుతం

Most from this category