News


హెచ్‌బీఐఎస్‌ గ్రూపుతో టాటా స్టీల్‌ కీలక ఒప్పందం

Tuesday 29th January 2019
Markets_main1548735948.png-23866

  • ఆగ్నేయ ఆసియా వ్యాపారాల్లో 70 శాతం వాటా అమ్మకం
  • డీల్‌ విలువ రూ.3,408 కోట్లు

న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ ఆగ్నేయ ఆసియాలోని తన వ్యాపారాల్లో మెజారిటీ వాటాను చైనాకు చెందిన హెచ్‌బీఐఎస్‌ గ్రూపునకు విక్రయించనుంది. ఇందుకు సంబంధించి హెచ్‌బీఐఎస్‌ గ్రూపు కంపెనీతో టాటా స్టీల్‌ అనుబంధ కంపెనీ టీఎస్ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా సింగపూర్‌లోని నాట్‌స్టీల్‌ హోల్డింగ్స్‌ పీటీఈ లిమిటెడ్‌, టాటా స్టీల్‌ (థాయిలాండ్‌) పబ్లిక్‌ కంపెనీ లిమిటెడ్‌లో 70 శాతం వాటాలను హెచ్‌బీఐఎస్‌ గ్రూపు కంపెనీకి 480 మిలియన్‌ డాలర్ల (రూ.3,408 కోట్లు) మొత్తానికి విక్రయించనుంది. ఇందులో టాటా స్టీల్‌కు 327 మిలియన్‌ డాలర్ల మేర నగదును హెచ్‌బీఐఎస్‌ గ్రూపు కంపెనీ చెల్లిస్తుంది. మరో 150 మిలియన్‌ డాలర్ల మేర రుణ భారాన్ని తనకిందకు తీసుకుంటుంది. ఈ కంపెనీల పుస్తక విలువకు డీల్‌ విలువ ఒకటిన్నర రెట్లుగా ఉంది. దేశీయ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి సారించాలన్న టాటా స్టీల్‌ వ్యూహంలో భాగమే ఈ విక్రయ ఒప్పందం. ఈ ఒప్పందం తర్వాత కూడా సదరు రెండు కంపెనీల్లో టాటా స్టీల్‌కు 30 శాతం వాటా ఉంటుంది. ఓ ప్రత్యేక కంపెనీకి ముందుగా టాటా స్టీల్‌ తన కంపెనీల్లోని నూరు శాతం వాటాలను బదలాయిస్తుంది. ఆ కంపెనీలో టాటా స్టీల్‌కు 30 శాతం, హెచ్‌బీఐఎస్‌ గ్రూపు కంపెనీకి 70 శాతం వాటా ఉంటుంది. భారీ నష్టాలు తెచ్చిపెడుతున్న యూరోప్‌ వ్యాపారాలను గతేడాది థిస్సెన్‌క్రప్‌తో విలీనం చేయడం ద్వారా భారీ జాయంట్‌ వెంచర్‌ను టాటా స్టీల్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన మరో ప్రధాన ఒప్పందం ఇది.



You may be interested

గ్రూప్‌ఎమ్‌లో భారీ పునర్వ్యస్థీకరణ

Tuesday 29th January 2019

హైదరాబాద్‌: డేటా సెంట్రిక్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ సర్వీసుల దిగ్గజ సంస్థ, గ్రూప్‌ఎమ్‌లో ఉన్నత స్థాయిలో భారీ పునర్వ్యస్థీకరణ చోటు చేసుకుంది. గ్రూప్‌ ఎమ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సౌత్‌ ఏషియా) ప్రశాంత్‌ కుమార్‌ నియమితులయ్యారు. ప్రెసిడెంట్‌ గ్రోత్‌ అండ్‌  ట్రాన్స్‌ఫార్మేషన్‌గా (సౌత్‌ ఏషియా) తుషార్‌ వ్యాస్‌ నియమితులయ్యారు. అలాగే గ్రూప్‌ఎమ్‌ కంపెనీలో ఒక విభాగమైన మైండ్‌షేర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా (సౌత్‌ ఏషియా) పార్థసారధి మాం‍డ్యం, మైండ్‌ షేర్‌ చీఫ్‌

జావా బుకింగ్స్‌... టాప్‌ -5లో హైదరాబాద్‌

Tuesday 29th January 2019

మార్చి నుంచి బైక్‌ల డెలివరీ భాగ్యనగరంలో మూడు షోరూంలు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జావా మోటార్‌సైకిళ్ల బుకింగ్స్‌లో హైదరాబాద్‌ టాప్‌-5లో నిలిచింది. దేశంలో దక్షిణాది నుంచే అత్యధిక బుకింగ్‌లు వచ్చినట్లు జావాను ప్రమోట్‌ చేస్తున్న క్లాసిక్‌ లెజెండ్స్‌ కో-ఫౌండర్‌ అనుపమ్‌ థరేజా వెల్లడించారు. హైదరాబాద్‌లో మూడు షోరూంలను ప్రారంభించిన సందర్భంగా సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ క్లోజ్‌ చేశాం. ఊహించిన దాని కంటే ఎక్కువ బుకింగ్స్‌ నమోదయ్యాయి. బ్రాండ్‌ న్యూ

Most from this category