STOCKS

News


టాటా స్పాంజ్‌ ఐరన్‌ లాభం 49 శాతం

Wednesday 18th July 2018
news_main1531890583.png-18425

న్యూఢిల్లీ: టాటా స్పాంజ్‌ ఐరన్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 49 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.31 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.46 కోట్లకు పెరిగిందని టాటా స్పాంజ్‌ ఐరన్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.202 కోట్ల నుంచి రూ.273 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్‌ 0.9 శాతం లాభంతో రూ.968 వద్ద ముగిసింది. 



You may be interested

4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో జియో టాప్‌

Wednesday 18th July 2018

న్యూఢిల్లీ: డౌన్‌లోడ్‌ స్పీడ్‌కు 4జీ టెలికం ఆపరేటర్లలో 4జీ డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌కి సంబంధించి రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిల్చింది. మరోవైపు అప్‌లోడ్‌కి సంబంధించి అత్యధిక స్పీడ్‌తో ఐడియా సెల్యులార్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. మే నెలకు సంబంధించిన ఈ గణాంకాలను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం వెల్లడించింది. దీని ప్రకారం జియో సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 22.3 ఎంబీపీఎస్‌గా ఉంది. ఇది సమీప ప్రత్యర్ధి సంస్థ

ఎగవేతదారులు దేశం నుంచి పారిపోకుండా చూడ్డం ఎలా?

Wednesday 18th July 2018

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ బడా రుణ ఎగవేతదారులు, ప్రమోటర్లు దేశం వదిలి పారిపోకుండా నిరోధించడం ఎలా అన్న అంశంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి ప్రస్తుత చట్టాల్లో సవరణలు, సూచనలు ఇవ్వడానికి ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ నేతృత్వం వహిస్తారు.  దేశీయ కంపెనీలకు సంబంధించి ప్రమోటర్ల విషయంలో భారత్‌ కాకుండా ఏ ఇతర దేశంలో పౌరసత్వం ఉంది?

Most from this category