STOCKS

News


మిస్త్రీని తొలగించడంలో నిబంధనల ఉల్లంఘన

Thursday 1st November 2018
Markets_main1541053416.png-21634

సమాచార హక్కు కింద ఆర్‌వోసీ సమాధానం

ముంబై: టాటా సన్స్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని అర్ధంతరంగా తొలగించడంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) ముంబై విభాగం స్పష్టం చేసింది. కంపెనీల చట్టం, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలతో పాటు టాటా సన్స్‌ స్వంత ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు పేర్కొంది. షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌కి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు ఆగస్టు 31న సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద దాఖలు చేసిన దరఖాస్తుకు ముంబైలోని అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఉదయ్ ఖొమానె ఈ మేరకు సమాధానమిచ్చారు. మరోవైపు, దీనిపై స్పందించేందుకు టాటా సన్స్ వర్గాలు నిరాకరించాయి. వివాదంపై న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నందున తాము వ్యాఖ్యానించబోమని పేర్కొన్నాయి. 2012లో రతన్ టాటా వారసుడిగా టాటా సన్స్ చైర్మన్‌గా వచ్చిన సైరస్ మిస్త్రీ 2016లో అర్ధంతరంగా ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. అదే ఏడాది డిసెంబర్‌లో టీసీఎస్ డైరెక్టరుగా కూడా ఆయన్ను తొలగించారు.You may be interested

నష్టాల్లో ఐటీ షేర్లు

Thursday 1st November 2018

కిందటి రోజు ట్రేడింగ్‌లో సూచీల భారీ లాభాలకు కారణమైన ఐటీ షేర్లు గురువారం ట్రేడింగ్‌ సెషన్‌లో మాత్రం నష్టాల బాట పట్టాయి. ఐటీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో 2.50శాతం శాతం నష్టపోయింది. డాలర్ మారకంలో రూపాయి బలపడటంతో ఐటీ షేర్లలో అమ్మకాలు పెరిగాయి. మధ్యాహ్నం గం.12:00లకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతం నష్టంతో 14,597 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే

హెరిటేజ్‌ లాభం 34శాతం డౌన్‌

Thursday 1st November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.7.4 కోట్ల నుంచి రూ.21 కోట్లకు పెరిగింది. టర్నోవరు మాత్రం రూ.828 కోట్ల నుంచి తగ్గి రూ.767 కోట్లకు పరిమితమయింది. గడిచిన ఆరు నెలల్లో చూస్తే (ఏప్రిల్‌- సెప్టెంబరు) రూ.1,382 కోట్ల టర్నోవరుపై రూ.42 కోట్ల నికరలాభం ఆర్జించింది.

Most from this category