STOCKS

News


హెచ్‌పీసీఎల్ బంకుల్లో చార్జింగ్ స్టేషన్లు

Friday 28th September 2018
news_main1538109406.png-20662

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి వాణిజ్య ప్రాతిపదికన చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్తాన్ పెట్రోలియంతో (హెచ్‌పీసీఎల్‌) టాటా పవర్ జట్టు కట్టింది. హెచ్‌పీసీఎల్‌ రిటైల్ అవుట్‌లెట్స్‌తో పాటు దేశవ్యాప్తంగా ఇతరత్రా ప్రాంతాల్లో కూడా ఈవీ చార్జింగ్ స్టేషన్స్‌ను ప్రారంభించేందుకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయని టాటా పవర్ వెల్లడించింది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ కార్లు, రిక్షాలు, బైక్‌లు, బస్సులు మొదలైన వాహనాల చార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అనువైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం తదితర అంశాల్లో ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయి. అలాగే పునరుత్పాదక విద్యుత్ తదితర రంగాల్లో కూఽడా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాదిత చార్జింగ్ స్టేషన్స్‌ ద్వారా దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింతగా పెరిగేందుకు తోడ్పడగలమని టాటా పవర్ సీఈవో ప్రవీర్ సిన్హా తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి చార్జింగ్‌ సమస్యలే ప్రధాన అవరోధంగా ఉంటున్నాయని,  చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుతో ఈ సమస్య పరిష్కారం కాగలదని హెచ్‌పీసీఎల్‌ ఈడీ రజనీష్ మెహతా పేర్కొన్నారు. 



You may be interested

భారత్‌ టాప్‌ 10 లక్ష్యం దిశగా లంబోర్గిని..!

Friday 28th September 2018

పూణే: ఇటలీకి చెందిన లగ్జరీ కార్‌ మేకర్‌ లంబోర్గిని భారత మార్కెట్‌పై దృష్టిసారించింది. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా ఇక్కడ సూపర్‌ స్పోర్ట్స్‌ కార్ల మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోందని వెల్లడించిన ఈ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సంస్థ.. విక్రయాల పరంగా అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్‌ టాప్‌ 10 దేశాల జాబితాలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. ఇటీవలే విడుదలైన ‘యూరస్‌’ సూపర్‌ ఎస్‌యూవీ డెలివరీలు కొనసాగుతున్నాయని, సగటు వెయిటింగ్‌ పిరియడ్‌ 6-9

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ షేర్‌హోల్డర్లతో ఆర్‌బీఐ సమావేశం రద్దు

Friday 28th September 2018

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్‌ అండ్ ఫైనాన్స్‌ సర్వీసెస్ (ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌) షేర్‌హోల్డర్లతో శుక్రవారం జరగాల్సిన సమావేశాన్ని రిజర్వ్ బ్యాంక్ రద్దయ్యింది. "శుక్రవారం జరగాల్సిన సమావేశం రద్దయ్యింది. ఒక నియంత్రణ సంస్థగా ఆ కంపెనీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏంటన్నది ఆర్‌బీఐ తెలుసుకోవాలనుకుంటోంది. భవిష్యత్ ప్రణాళిక, తీసుకోబోయే దిద్దుబాటు చర్యల వివరాలు ఆర్‌బీఐకి కావాలి" అని సంబంధిత వర్గాలు తెలిపాయి. తదుపరి సమావేశం తేదీ ఇంకా ఖరారు కాలేదని

Most from this category