STOCKS

News


టాటా పవర్‌... ‘పవర్‌’

Tuesday 30th October 2018
Markets_main1540880403.png-21583

  • ఎన్‌సీడీల ద్వారా రూ.5,500 కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: టాటా పవర్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 85 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.213 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.393 కోట్లకు పెరిగిందని టాటా పవర్‌ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ.274 కోట్ల రెగ్యులేటరీ ఆదాయం కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. గత క్యూ2లో రూ.7,007 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.7,437 కోట్లకు పెరిగింది. ఎబిటా 4.5 శాతం తగ్గి రూ.1,727 కోట్లకు తగ్గిందని తెలిపింది. ఎబిటా మార్జిన్‌ 2.8 శాతం తగ్గి 23.5 శాతానికి చేరిందని వివరించింది. ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఈ క్యూ2లో ఈ కంపెనీ రూ.1,680 కోట్ల ఎబిటాను, 21.8 శాతం ఎబిటా మార్జిన్‌ను సాధించగలదని విశ్లేషకులు అంచనా వేశారు. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్లు (ఎన్‌సీడీ) జారీ చేసి, తద్వారా రూ.5,500 కోట్ల సమీకరించడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. కాగా ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి సానుకూలమైన కోర్ట్‌ తీర్పు కారణంగా టాటా పవర్‌ షేర్‌ జోరుగా పెరిగింది.You may be interested

రెండోరోజూ అదే జోరు ..!

Tuesday 30th October 2018

క్రితం రోజు మార్కెట్‌ భారీ లాభాలకు కారణమైన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లు రెండో రోజూ అదే జోరును కనబరుస్తున్నాయి. ఈ ప్రభుత్వ బ్యాంక్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌లో 5శాతం లాభపడింది. గత ట్రేడింగ్‌లో ఇండెక్స్‌ 8శాతం లాభపడిన సంగతి తెలిసిందే. ఉదయం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(2,778.40)తో పోలిస్తే 4శాతం లాభంతో 2,892.35ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి

విజయ బ్యాంక్‌ లాభం 24శాతం

Tuesday 30th October 2018

తగ్గిన మొండి బకాయిలు 12 శాతం పెరిగిన మొత్తం ఆదాయం బెంగళూరు: ప్రభుత్వ రంగ విజయ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 25 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.185 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.140 కోట్లకు తగ్గిందని విజయ బ్యాంక్‌ తెలిపింది. కేటాయింపులు అధికంగా ఉండటం వల్ల నికర లాభం తగ్గిందని బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ ఆర్‌.ఎస్‌. శంకర

Most from this category