STOCKS

News


నానో కథ ముగిసినట్టే... పెలికాన్‌ రానట్టే!?

Sunday 12th August 2018
news_main1534075888.png-19186

సామాన్యుడి ‘సొంత కారు’ కలను సాకారం చేయాలంటూ రతన్‌ టాటా స్వప్నించి తీసుకొచ్చిన నానో కారు కథ ముగిసినట్టేనా..? టాటా మోటార్స్‌ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, పరిశీలకులు మాత్రం ఇదే భావిస్తున్నారు. సామాన్యుడికి సొంత కారు, తమకు లాభాల కారుగా మారుతుందన్న నానో, అటు సామాన్యుడినీ ఆకట్టుకోలేకపోయింది... ఇటు టాటా మోటార్స్‌కు సైతం లాభాలు లేకపోగా నష్టాల ప్రాజెక్టుగా మారి కూర్చుంది. జూన్‌ నెలలో టాటా మోటార్స్‌ విక్రయించిన నానో కార్లు కేవలం మూడే. ఈ గణాంకాలు చాలు నానో కారు భవిష్యత్తు ఏంటో చెప్పేందుకు? అన్నది విశ్లేషణ. 

 

నానో కార్ల అమ్మకాలు అడుగంటిపోవడం, అదే సమయంలో భవిష్యత్తు తరానికి అనుగుణమైన కార్ల తయారీపై కంపెనీ దృష్టి పెట్టడం తాజా పరిస్థితి వెనుక ఉన్న కారణాలుగా తెలుస్తున్నాయి. 2019 అక్టోబర్‌ నుంచి క్రాష్‌ టెస్ట్‌ (ప్రమాదంలో కారు రక్షణను తెలుసుకునే) కొత్త నిబంధనలను చేరుకోవాలంటే నానో కోసం మరిన్ని నిధులను ఖర్చు చేయడం కూడా ఈ ప్రాజెక్టును వదిలించుకోవాలని కంపెనీ భావిస్తుందనడానికి కారణంగా పేర్కొంటున్నారు. ఇక నానో స్థానంలో ఆధునిక ఫీచర్లతో పెలికాన్‌ను తీసుకువద్దామని టాటా మోటార్స్‌ భావించగా, ఇది కూడా ఆగిపోయినట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి 2017లోనూ టాటా మోటార్స్‌ నానో ఉత్పత్తిని నిలిపివేసిందన్న వార్తలు వచ్చాయి. అప్పట్లో వాటిని కంపెనీ ఖండించింది. కానీ, ఈ సారి నానో ఆగిపోయినట్టేనన్న వార్తలను ఇంకా ఖండించలేదు. కానీ, వాస్తవ అంశాలు నానో త్వరలోనే కనుమరుగు కానుందని తెలియజేస్తున్నాయి. ఎందుకంటే నానో కోసం ఏర్పాటు చేసిన సనంద్‌ ప్లాంట్‌లో టియాగో, టిగోర్‌ కార్లను ఉత్పత్తి చేస్తుండడం, నానో విడిభాగాల కోసం అక్కడ ఏర్పాటైన చిన్న యూనిట్లను టియాగో, టిగోర్‌ విడిభాగాలను అందించే విధంగా అప్‌గ్రేడ్‌ చేసినట్టు స్వయంగా టాటా మోటార్స్‌ జూన్‌ ఫలితాల సందర్భంగా ప్రకటించడం గమనార్హం. You may be interested

‘ఈక్విటీ99’ నుంచి మూడు స్టాక్‌ సిఫారసులు

Sunday 12th August 2018

నిఫ్టీ, సెన్సెక్స్‌ ఎప్పటికప్పుడు నూతన గరిష్ట స్థాయిలను నమోదు చేస్తూ వెళుతున్నాయి. ప్రతీ చిన్న కరెక్షన్‌లోనూ కొనుగోళ్లు చేసుకుంటున్నాయి. దీంతో మార్కెట్లు గతంతో పోలిస్తే బలంగా కనిపిస్తున్నాయి. తమ అంచనాల ప్రకారం ఈ స్థాయిల్లో మార్కెట్లు స్థిరీకరణ చెందుతాయని ‘ఈక్విటీ99’ వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్‌గయాన్‌ పేర్కొన్నారు. నాణ్యమైన మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సైతం ర్యాలీ చేస్తాయని అంచనా వ్యక్తం చేశారు. స్వల్ప కాలంలో వృద్ధికి అవకాశం ఉన్న మూడు స్టాక్స్‌ను

ఫిజికల్‌ రూపంలో షేర్లను కలిగి ఉండొచ్చు: సెబీ

Sunday 12th August 2018

ఇన్వెస్టర్లు ఫిజికల్‌ పత్రాల రూపంలో షేర్లను కలిగి ఉండడంపై ఇన్వెస్టర్లలో సందేహాలు నెలకొనడంతో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వివరణ ఇచ్చింది. ఇన్వెస్టర్లు ఫిజికల్‌ రూపంలోనూ షేర్లను కలిగి ఉండొచ్చని స్పష్టం చేసింది. తమ నూతన మార్గదర్శకాలు డిసెంబర్‌ 5 తర్వాత ఇన్వెస్టర్లు ఫిజికల్‌ రూపంలో కలిగి ఉండడాన్ని నిషేధించడం లేదని పేర్కొంది. సెబీ ఇటీవలి మార్గదర్శకాల్లో స్పష్టత లోపించడంతో సెబీకి ఎంతో మంది ఇన్వెస్టర్ల నుంచి కాల్స్‌

Most from this category