STOCKS

News


తొలి ‘‘హ్యారియర్‌’’ విడుదల

Wednesday 31st October 2018
news_main1540970409.png-21604

  • వచ్చే ఏడాదిలో డెలివరీలు

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన ప్రీమియం ఎస్‌యూవీ ‘హ్యారియర్‌’ తొలి కారు మంగళవారం విడుదలైంది. పుణే యూనిట్‌లో ఈ ఎస్‌యూవీ ఉత్పత్తి అయ్యిందని, వచ్చే ఏడాది తొలి అర్థభాగంలోనే దేశవ్యాప్తంగా విడుదలకానుందని కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ప్యాసింజర్‌ వాహన వ్యాపార యూనిట్‌ ప్రెసిడెంట్‌ మయాంక్ పరీక్‌ మాట్లాడుతూ.. ‘జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్) సహకారంతో కేవలం ఆరు నెలల్లోనే ఈ ఎస్‌యూవీ రూపుదిద్దుకుంది. వచ్చే ఏడాదిలో డెలివరీలకు సిద్ధమవుతున్నాం. 2019 తొలినాళ్లలోనే దేశవ్యాప్తంగా డెలివరీలు ప్రారంభిస్తాం.’ అని వ్యాఖ్యానించారు.



You may be interested

ఏటీఎం నుంచి ఇక రోజుకు రూ.20వేలే

Wednesday 31st October 2018

ఎస్‌బీఐ విత్‌డ్రాయల్స్‌పై పరిమితి నేటి నుంచీ అమల్లోకి... కార్డు మోసాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయెల్‌ పరిమితిని సగానికి సగం తగ్గించేసింది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.40,000 ఉండగా... దీనిని బుధవారం నుంచి రూ.20,000కు తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది. నిజానికి ఎస్‌బీఐ ఈ నెల మొదట్లోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించినా... అక్టోబర్‌ 31 నుంచీ

రూపీ పతనంతో అదరగొడుతున్న ఐటీ షేర్లు

Wednesday 31st October 2018

ఆటుపోటు మార్కెట్‌ ట్రేడింగ్‌ రూపాయి పతనంతో ఐటీ షేర్లు పండుగ చేసుకుంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ బుధవారం 2.62శాతం లాభపడింది. డాలరు ఇండెక్స్‌ పటిష్ట ర్యాలీకి తోడు, కేంద్రం, ఆర్‌బీఐకి తీవ్ర విభేదాలు తలెత్తిన నేపథ్యంలో డాలరు మారకంలో రూపాయి విలువ నేడు 74.13 స్థాయికి క్షీణించిన సంగతి తెలిసిందే. రూపాయి పతనంతో ఐటీ షేర్లలో నేడు కొనుగోళ్లు పెరిగాయి. ఫలితంగా నిఫ్టీ ఐటీ

Most from this category