STOCKS

News


టాటా మోటార్స్‌ నష్టం రూ. 1,049 కోట్లు

Wednesday 31st October 2018
Markets_main1540981708.png-21616

 టాటా గ్రూప్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ తాజాగా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,049 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో క్యూ1లో ప్రకటించిన రూ. 1,800 కోట్ల నష్టంకంటే ఇది తక్కువ. కాగా గతేడాది సెప్టెంబర్‌ క్వార్టర్లో కంపెనీ రూ. 2,483 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీకి చెందిన యూరప్‌ సబ్సిడరీ జాగ్వర్‌ లాండ్‌రోవర్‌ (జెఎల్‌ఆర్‌) కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నష్టాల్లోకి జారుకున్న టాటా మోటార్స్‌ తాజా త్రైమాసికంలో కూడా జెఎల్‌ఆర్‌ ద్వారా 10 కోట్ల పౌండ్ల నష్టాన్ని తెచ్చుకుంది. బుధవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. టాటా మోటార్స్‌ షేరు స్వల్ప పెరుగుదలతో రూ. 178.65 వద్ద ముగిసింది. 
 



You may be interested

ఐటీ రంగంలో ఈ షేర్లు భేష్‌..!

Wednesday 31st October 2018

టెక్‌ మహీంద్ర, టీసీఎస్‌, ఎన్‌ఐఐటీ షేర్లను కొనొచ్చు.. ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయూరేష్‌ జోషి సూచన ముంబై: మిడ్‌క్యాప్‌ ఐటీ రంగ షేర్లలో ఎన్‌ఐఐటీ మినహాయించి మిగిలిన అన్ని షేర్లు ఇన్వెస్టర్లకు నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో వీటి జోలికి వెళ్లడం కంటే ఎంపిక చేసిన టాప్‌ ఐటీ రంగ షేర్లను కొనుగోలు చేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చని ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయూరేష్‌ జోషి సూచించారు. ఈ

ఈసారి దీపావళికి మార్కెట్‌ ఎటూ..?

Wednesday 31st October 2018

- గడిచిన 10 ఏళ్లలో 5 సార్లు మాత్రమే లాభాలు - అక్టోబర్‌ 2011 దీపావళి నెలలోనే అత్యధికంగా 10 శాతం రాబడి ముంబై: మార్కెట్‌ పరంగా దీపావళీ అంటే అదో సెంటిమెంట్‌. లక్ష్మీదేవి కటాక్షం కోరుతూ ప్రత్యేక పూజలు జరిగే సందర్భం. పలు ప్రాంతాలలో కొత్త పుస్తకాలతో వ్యాపారం మొదలయ్యే ఈరోజును అనేక మంది ఇన్వెస్టర్లు నూతన సంవత్సరంగా కూడా భావిస్తుంటారు. ఇంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి దీపావళి సమయంలో ఈసారి ఇన్వెస్టర్లు

Most from this category