STOCKS

News


టాటామోటర్స్‌ నిర్ణయంతో షాకయ్యాం!

Tuesday 16th October 2018
news_main1539666450.png-21193

జాయింట్‌ వెంచర్‌ నుంచి వైదొలగాలన్న టాటామోటర్స్‌ నిర్ణయం తొలుత తమకు షాక్‌ కలిగించిందని టాటా హిటాచీ సీనియర్‌ డైరెక్టర్‌ షిన్‌ నకజిమా చెప్పారు. టాటాల నుంచి అలాంటి అనూహ్య నిర్ణయాన్ని తాము ఊహించలేదన్నారు. హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జేవీ వాటా విక్రయం, రూపీ క్షీణత, యెన్‌ మారకం తదితర అంశాలపై ఆయన ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలివీ...
ప్ర: టాటా హిటాచీ జాయింట్‌ వెంచర్‌లో వాటాలను విక్రయానికి ఉంచినట్లు టాటామోటర్స్‌ గత త్రైమాసిక ఫలితాల సందర్భంగా ప్రకటించింది కదా! ఈ విక్రయం ఎంతవరకు వచ్చింది?
జ: టాటా మోటర్స్‌ నిర్ణయం అనూహ్యం. నిజానికి ఆ ప్రకటన వచ్చేవరకు మాకూ తెలీదు. ఒక్కసారిగా టాటాల నుంచి అలాంటి ప్రతిపాదన రావడం విస్మయం కలిగించింది. నిజానికి టాటా హిటాచీ జాయింట్‌ వెంచర్‌లో పూర్తి వాటా తీసుకునేందుకు హిటాచీకి ఏ అభ్యంతరమూ లేదు. అలాంటప్పుడు మాతో నేరుగా చర్చిస్తారనుకున్నాం. ఈ లోపే టాటాల నుంచి ప్రకటన వచ్చింది. అనంతరం జపాన్‌ నుంచి హిటాచీ ప్రతినిధులు వచ్చి చర్చలు జరిపారు. ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. 
ప్ర: జేవీలో ఎవరి వాటా ఎంత? కంపెనీ పనితీరు ఎలా ఉంది?
జ: జేవీలో టాటామోటర్స్‌కు 40 శాతం, హిటాచీకి 60 శాతం వాటా ఉంది. మాంద్యం సమయంలో కంపెనీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవటం నిజమే. కానీ 2015 నుంచి మంచి పనితీరు కనబరుస్తోంది. ప్రస్తుతం లాభాల్లోనే నడుస్తోంది. అందుకే వాటాలు విక్రయించాలని టాటా మోటర్స్‌ భావించి ఉండొచ్చు. వీలున్నంతవరకు జేవీలో వాటాలను విక్రయించడం జరిగితే హిటాచీనే సొంతం చేసుకుంటుంది.
ప్ర: రూపీ క్షీణత ఎంతవరకు ఉండవచ్చు?
జ: ఫెడ్‌ నిర్ణయాలతో డాలర్‌ ఇండెక్స్‌ అనూహ్యంగా బలపడింది. దీంతో వర్దమాన కరెన్సీలు ఇబ్బందులు పడ్డాయి. రూపాయిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన చర్యలు త్వరలో ఫలితాలనివ్వవచ్చు. రూపీ స్వల్పకాలానికి 74- 75 రేంజ్‌లో స్థిరత్వం పొందవచ్చు.
ప్ర: యెన్‌ కదలికలు ఇండో జపనీస్‌ కంపెనీలపై ఎలా ఉండొచ్చు?
జ: డాలర్‌ ఇండెక్స్‌ బలపడడంతో ఇతర కరెన్సీల్లాగానే యెన్‌ సైతం బలహీన పడింది. అయితే ఇటీవల కాలంలో తిరిగి యెన్‌ పుంజుకుంది. యెన్‌ బలపడితే ఇండో జపనీస్‌ కంపెనీలకు ఇబ్బందులు ఉండొచ్చు. కానీ డాలర్‌ స్థిరపడితే యెన్‌, రూపీల్లో సైతం స్థిరత్వం వస్తుంది. కరెన్సీల్లో ఈ కల్లోలం మరికొన్ని త్రైమాసికాలు కంపెనీల ఫలితాలపై నెగిటివ్‌ ప్రభావం చూపవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఎకానమీలు బుల్లిష్‌గా మారుతున్నాయి. You may be interested

10,600 పైకి నిఫ్టీ

Tuesday 16th October 2018

ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు జోరుమీదున్నాయి. వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాలతో దూసుకెళ్తున్నాయి. నిఫ్టీ మళ్లీ 10,600 మార్క్‌ పైకి వెళ్లింది. ఇక సెన్సెక్స్‌ 35,200 మార్క్‌కు పైకి వచ్చింది. ఉదయం 10:42 సమయంలో నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 10,595 వద్ద, సెన్సెక్స్‌ 318 పాయింట్ల లాభంతో 35,183 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 34,913 కనిష్ట, 35,215 గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 10,525

ఈ-కామర్స్‌ అమ్మకాలు రూ.15,000 కోట్లు

Tuesday 16th October 2018

న్యూఢిల్లీ: దేశీ ఈ-కామర్స్‌ సంస్థలు పండుగ సీజన్‌ అమ్మకాలలో సంచలనం సృష్టించాయి. గడిచిన 5 రోజుల ఫెస్టివల్‌ సేల్స్‌లో ఏకంగా 64 శాతం వృద్ధిరేటును సాధించినట్లు రెడ్‌సీర్‌ కన్సెల్టింగ్‌ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం అక్టోబర్ 9 నుంచి 14 వరకు కొనసాగిన పండుగ సీజన్‌ ఆఫర్లలో రూ.15,000 కోట్లు అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో రూ.10,325 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మరోవైపు ఈ సీజన్‌లో

Most from this category