STOCKS

News


ట్రక్‌ ఈజీలో 26 శాతం వాటా కొనుగోలు చేసిన టాటా మోటార్స్‌

Tuesday 10th July 2018
news_main1531241848.png-18189

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ తొలిసారిగా ఒక స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టింది. టెక్నాలజీ ఆధారిత ఫ్రైట్‌ అగ్రిగేటర్‌ ట్రక్‌ఈజీలో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది.  టాటా మోటార్స్‌ పూర్తి అనుబంధ సంస్థ టాటా మోటార్స్‌ ఫైనాన్స్‌ హోల్డిం‍గ్స్‌ కంపెనీ ఈ వాటాను కొనుగోలు చేసిందని టాటా మోటార్స్‌ తెలిపింది. అయితే ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ట్రక్కుల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ స్టార్టప్‌లో వాటాను కొనుగోలు చేశామని టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌(కమర్షియల్‌ వెహికల్స్‌ బిజినెస్‌ యూనిట్‌) గిరీశ్‌ తెలిపారు. కాగా టాటా మోటార్స్‌ పెట్టుబడులతో ఇతర నగరాలకు విస్తరిస్తామని ట్రక్‌ఈజీ సీఈఓ నిఖిల్‌ థామస్‌ తెలిపారు. బెంగళూరుకు చెందిన లాజిస్టిక్స్‌ కంపెనీ, లాజినామిక్స్‌ టెక్నాలజీస్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ట్రక్‌ఈజీ స్టార్టప్‌ను 2015లో ప్రారంభించింది. బెంగళూరు నగరంలోని వ్యాపారాల రవాణా అవసరాలకు తగిన సేవలందించడం కోసం  ఈ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. 



You may be interested

ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌ !

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలు ద్వారా బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశిస్తున్న ఎల్‌ఐసీ... ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలు కోసం బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ, ఐఆర్‌డీఏఐ ఇటీవలనే ఎల్‌ఐసీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎల్‌ఐసీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం కూడా పొందిన తర్వాత ఓపెన్‌ ఆఫర్‌కు అనుమతించాలంటూ మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీని ఎల్‌ఐసీ  కోరవచ్చని

మేం పోటీలో ఉంటాం: వొడాఫోన్‌

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ: ఐడియా సెల్యులర్‌తో విలీనాంతరం భారత్‌ మార్కెట్‌లో పోటీలో ఉంటామని బ్రిటిష్‌ టెలికం దిగ్గజం వోడాఫోన్‌ గ్రూప్‌ సీఈవో, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ నిక్‌ రీడ్‌ తెలిపారు. వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులర్‌ విలీనం ఆమోదం తర్వాత వొడాఫోన్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌ మంగళవారం కమ్యూనికేషన్స్‌ మంత్రి మనోజ్‌ సిన్హా, ఆ శాఖా కార్యదర్శి అరుణ సుందరరాజన్‌తో సమావేశమైంది. విలీన ఆమోదపు ఆర్డర్‌ చేతికి వచ్చిందని, ఆ పత్రాలను అందుకోవడం సంతోషంగా

Most from this category