STOCKS

News


టాటా మోటర్స్‌షేరుపై అనలిస్టులు ఏమంటున్నారు?

Friday 8th February 2019
news_main1549610156.png-24089

క్యు3 ఫలితాల ప్రభావంతో టాటామోటర్స్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో కుప్పకూలింది. ఇంట్రాడేలో దాదాపు 29 శాతం పతనమైంది. జేఎల్‌ఆర్‌ దెబ్బ కంపెనీ ఫలితాలపై గట్టిగా పడింది. దీంతో పలు అనలిస్టులు కంపెనీ ఈపీఎస్‌ టార్గెట్‌ను 25 శాతం వరకు తగ్గించారు. ఇకపై జేఎల్‌ఆర్‌ విషయమై మరిన్ని ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల ఫలితంగా ఇంట్రాడేలో దశాబ్దకాలంగా చూడని పతనాన్ని కంపెనీ షేరు చవిచూసింది. ఇకమీదట ఈ షేరులో పెద్దగా అప్‌మూవ్‌ ఉండకపోవచ్చని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. 


- ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌: జేఎల్‌ఆర్‌ ఆస్తుల విషయమై మరింత స్పష్టత రావాల్సిఉంది. చైనా పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. బ్రాండ్‌ను నిలబెట్టేందుకు కంపెనీ విశ్వప్రయత్నం చేస్తోంది. కానీ డిమాండ్‌ చాలా బలహీనంగా ఉంది. అందువల్ల ఎబిటా అంచనాను 8 శాతానికి, ఈపీఎస్‌ అంచనాను 26 శాతానికి తగ్గించింది. టార్గెట్‌ను రూ. 201 నుంచి రూ. 179కి తగ్గించింది.
- మోతీలాల్‌ఓస్వాల్‌: నికర రుణభార అంచనాలను రెట్టింపు చేసింది. రేటింగ్‌ను న్యూట్రల్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. టార్గెట్‌ను రూ. 166కు తగ్గించింది.
- డాయిష్‌బ్యాంక్‌: కంపెనీకి సవాళ్లు కొనసాగుతాయి. ఈపీఎస్‌ అంచనాలను 38 శాతానికి, టార్గెట్‌ను రూ. 175కి కట్‌ చేసింది.
- జేపీ మోర్గాన్‌ సంస్థ షేరు టార్గెట్‌ ధరను రూ. 170కి, బీఎన్‌పీ పారిబా రూ. 150కి తగ్గించాయి. 
- జెఫర్రీస్‌, మేబ్యాంక్‌, క్రెడిట్‌ సూసీలు మాత్రం టార్గెట్‌ ధరను రూ. 250- 280 రేంజ్‌లో ఉంచాయి. 



You may be interested

ఆల్‌టైం గరిష్టానికి ఇన్ఫోసిస్‌

Friday 8th February 2019

దేశీయ ఐటీ దిగ్గజం సంస్థ ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ షేరు శుక్రవారం కొత్త ఆల్‌టైంకి నమోదు చేసింది. నేడు బీఎస్‌ఈలో ఇన్ఫీ షేరు రూ. 763.35ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఐటీ షేర్లలో ర్యాలీ భాగంగా ఈ షేరు 1శాతం లాభపడి రూ.771.15ల వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మధ్యాహ్నం గం.12:45ని.లకు షేరు గతముగింపు(రూ.763.35)తో​ పోలిస్తే అరశాతం లాభంతో రూ.767ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ పతనంలో

అమ్మకాల ఒత్తిడిలో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు

Friday 8th February 2019

6శాతం క్షీణించి యూనియన్‌ బ్యాంక్‌ షేరు దాదాపు ఏడాదిన్నర తరువాత ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే స్వల్ప కాలిక నిధులపై వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లు శుక్రవారం అమ్మకాల ఒత్తిడికి లోనుతున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లలో అత్యధికంగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంకింగ్‌ దాదాపు 2శాతం నష్టపోయింది. యూనియన్‌ బ్యాంక్‌ అత్యధికంగా 6శాతం నష్టపోయింది. సిండికేట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌

Most from this category