STOCKS

News


టాటామోటర్స్‌.. ఆశించిన స్థాయిలో అమ్మకాలు

Saturday 1st September 2018
news_main1535799343.png-19883

టాటామోటర్స్‌ ఆగస్ట్‌లో ఆశించిన స్థాయిలో వాహన విక్రయాలను జరిపింది. ఈ నెలలో మొత్తం 58,262 వాహనాలను విక్రయించింది.  గతేడాది ఇదే నెలలో జరిపిన మొత్తం 45,906 వాహన అమ్మకాలతో పోలిస్తే ఇది27 శాతం అధికం. వాణిజ‍్య వాహన విభాగంలో 39,859 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గతేడాదితో ఇదే డిసెంబర్‌ 31,566 అమ్మకాలతో పోలిస్తే ఇది 26శాతం ఎక్కువ. పాసింజర్‌ వాహన విభాగంలో గతేడాది విక్రయాలతో పోలిస్తే 28శాతం వృద్ధిని సాధించి 18,420 యూనిట్ల అమ్మకాలను జరిపింది. మధ్య, భారీ తరహా వాహనాలను ఈ ఆగస్ట్‌లో మొత్తం 12,715 వాహనాలకు విక్రయించింది. విదేశాలకు వాహనాల ఎగుమతుల్లో ఏకంగా 78శాతం వృద్ధి సాధించింది. గతేడాది ఇదే ఆగస్ట్‌లో 3,082 వాహనాలకు మాత్రమే ఎగుమతి చేయగా, ఈ ఆగస్ట్‌లో 5,478 వాహనాలను ఎగుమతి చేసింది.



You may be interested

పన్నెండు వేలకు చేరితే పారాహుషార్‌!

Saturday 1st September 2018

అప్రమత్తంగా ఉండాలంటున్న అనలిస్టులు స్టాక్‌మార్కెట్లకు సెప్టెంబర్‌ పెద్దగా కలిసిరాదని గతంలో తేలిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఈ నెల్లో ప్రాఫిట్‌ బుకింగ్‌ నమోదవుతుందన్నారు. అందువల్ల షార్ట్‌టర్మ్‌ ట్రేడర్లు నిఫ్టీ 12వేల పాయింట్లకు చేరితే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. 12వేల పాయింట్ల వద్ద కొత్త పొజిషన్ల జోలికి దాదాపు పోకపోవడం మంచిదని సలహా ఇచ్చారు. నిఫ్టీ 10550 పాయింట్ల స్థాయి నుంచి ప్రస్తుతం 11700 స్థాయిలకు ర్యాలీ జరిపింది. ఈ ర్యాలీకి

స్వల్పంగా పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు

Saturday 1st September 2018

ముంబై:- దేశీయ విదేశీ మారక నిల్వలు ఆగస్టు 24తో ముగిసిన వారాంతానికి 445.4 మిలియన్ డాలర్లు పెరిగి 401.293 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకు ముందువారం ఆగస్టు 17తో ముగిసిన వారాంతానికి 33.2 మిలియన్ డాలర్ల మేరతగ్గి 400.847 బిలియన్ డాలర్లకు పడిపోయిన సంగతి తెలిసిందే. బంగారం నిల్వలు 35.7 మిలియన్ డాలర్లు పెరిగి 20.763 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కాగా ఐఎంఎఫ్ వద్ద నిల్వలు కూడా 8.6 మిలియన్

Most from this category