STOCKS

News


ఏపీలో మెటాలిక్స్‌ విత్తన కేంద్రం

Wednesday 21st November 2018
news_main1542776909.png-22256

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టాటా గ్రూప్‌కు చెందిన అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ కంపెనీ మెటాలిక్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌లో విత్తన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌ సీడ్‌ క్యాపిటల్‌గా అభివృద్ధి చెందుతోందని, ఎగుమతులక్కూడా అవకాశం ఉండటంతో ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిర్ణయించామని తెలియజేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండు విత్తన ఫ్యాక్టరీలతో పాటు కరీంనగర్, వరంగల్, ఏలూరు, కడప వంటి ప్రాంతాల్లో విత్తన ఉత్పత్తి కేంద్రాలున్నాయి.
మంగళవారమిక్కడ ‘జెనిటికల్లీ మోడిఫైడ్‌ ఆర్గానిజం’ (జీఎంవో) అనే అంశంపై జరిగిన చర్చలో మెటాలిక్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఎండీ అండ్‌ సీఈఓ ఎస్‌ నాగరాజన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’తో మాట్లాడారు. ప్రస్తుతం మెటాలిక్స్‌.. ధాన్య సీడ్స్‌ బ్రాండ్‌ పేరిట విత్తనాలను విక్రయిస్తోంది. ప్రస్తుతం ధాన్య నుంచి గోధుమ, పత్తి, మిరప, టమోటా, బెండ, జొన్న, సజ్జ వంటి విత్తనాలున్నాయని.. త్వరలోనే త్వరలోనే ఆవ విత్తనాలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.315 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నామని.. ఇందులో ఏపీ, తెలంగాణ నుంచి రూ.15 కోట్ల వాటా ఉంటుందని తెలిపారు.



You may be interested

రూ.30700ల వద్ద పసిడి ధర

Wednesday 21st November 2018

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ర్యాలీ పసిడి ధరను దెబ్బతీస్తుంది. నేడు డిసెంబర్‌ కాంట్రాక్టు పసిడి ధర రూ. 30,775.00ల వద్ద ప్రారంభమైంది. గతవరుస ఆరు ట్రేడింగ్‌ సెషన్‌లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం పసిడి ధరపై ప్రభావాన్ని చూపుతోంది. ఫలితంగా ఉదయం గం.10:30ని.లకు ఎంసీక్స్‌లో 10గ్రాముల పసిడి ధర క్రితం ముగింపు ధర(రూ. 30814)తో పోలిస్తే రూ.56.00లు నష్టపోయి రూ.30758.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూపాయి ర్యాలీ కారణంగా పసిడి

స్టార్టప్స్‌ వేల్యుయేషన్స్‌పై కేంద్రం దృష్టి

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చిన స్టార్టప్ సంస్థలు భారీ వేల్యుయేషన్స్ దక్కించుకుంటూ ఉండటంపై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ దృష్టి సారించింది. ఈ స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు భారీ ప్రీమియంతో షేర్లు తీసుకోవడం వెనుక అసలు కారణాలను తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. తొలి విడత నిధుల సమీకరణ తర్వాత వేల్యుయేషన్స్‌ గణనీయంగా పడిపోయిన కంపెనీలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2013 నుంచి నిధులు సమీకరించిన 2,000 పైచిలుకు

Most from this category