STOCKS

News


తెలంగాణ మార్కెట్లోకి టాటా హిటాచీ షిన్రాయ్‌

Monday 15th October 2018
news_main1539583583.png-21160

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:: సరికొత్త బ్యాక్‌హోలోడర్‌ షిన్రాయ్‌ని టాటా హిటాచీ తెలంగాణ మార్కెట్లోకి విడుదల చేసింది. తక్కువ ఆర్‌పీఎం, ఎక్కువ శక్తి ఉన్న షిన్రాయ్‌ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందిందని టాటా హిటాచీ ఎండీ సందీప్‌ సింగ్‌ చెప్పారు. బ్యాక్‌హోలోడర్స్‌ విభాగంలో కనీసం పది శాతం మార్కెట్‌ వాటా దక్కించుకోవాలని లక్ష్యిస్తున్నట్లు తెలిపారు. ఎక్సవేటర్‌ రంగంలో తాము బలంగా ఉన్నామని, షిన్రాయ్‌తో బ్యాక్‌హోలోడర్స్‌ విభాగంలో కూడా సత్తా చాటుతామని తెలిపారు. 2011-14 కాలంలో మందగమనం కారణంగా వృద్ధి బాగా క్షీణించిందని, 2015నుంచి క్రమానుగత రికవరీ నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 15- 20 శాతం వృద్ది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జీఎస్‌టీ, రూపీ క్షీణత ప్రభావం ధరలపై ఉంటుందన్నారు. షిన్రాయ్‌ ధర రూ. 26- 28 లక్షల రేంజ్‌లో ఉందని చెప్పారు.
 



You may be interested

‘పొదుపు’ మళ్లీ కళకళ!

Monday 15th October 2018

వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ కళొచ్చింది. సామాన్యుల పొదుపు సాధనాలుగా వర్ధిల్లిన ఈ పథకాలు నాలుగేళ్లుగా వడ్డీ రేట్ల క్షీణతతో కాస్తంత కళ తప్పాయనే చెప్పాలి. అయినప్పటికీ బ్యాంకులతో పోలిస్తే గతంలోనూ, ఇప్పుడు కూడా కాస్తంత ఎక్కువ రాబడి వస్తున్నది చిన్న మొత్తాల పొదుపు పథకాల్లోనేనని నిస్సందేహంగా చెప్పుకోవాలి. అయితే, దేశంలో తిరిగి వడ్డీ రేట్లు పెరుగుతున్న వాతావరణం నెలకొంది. ఫలితంగా... అక్టోబర్‌ 1

సుగర్‌ కంపెనీల స్టాకులపై పాజిటివ్‌!

Monday 15th October 2018

స్టీవర్ట్‌ అండ్‌ మాకరిట్చ్‌  ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఇథనాల్‌ పాలసీతో సుగర్‌ కంపెనీల స్టాకులకు మేలు జరుగుతుందని స్టీవర్ట్‌ అండ్‌ మాక్‌రిట్చ్‌ బ్రోకరేజ్‌ అంచనా వేస్తోంది. బలరామ్‌పూర్‌ చిని, ధర్మపూర్‌ సుగర్‌, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌పై పాజిటివ్‌గా ఉన్నట్లు తెలిపింది. ఈ స్టాకులు మరో 50- 90 శాతం వరకు ర్యాలీ జరపగలవని అభిప్రాయపడింది.  1. బలరాంపూర్‌ చిని: టార్గెట్‌ రూ. 152. ఇప్పటికే కంపెనీకి భారీ డిస్టిలరీ సామర్ధ్యం ఉంది. కొత్తగా గులారియా

Most from this category