STOCKS

News


జెట్‌లో టాటాకు వాటా??

Thursday 18th October 2018
news_main1539852209.png-21272

దేశీ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌.. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోందనే వార్త ఇప్పుడు మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ.. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం చూస్తే.. టాటా గ్రూప్‌.. జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలు కోసం చర్చలు ప్రారంభించింది. ఇందులో భాగంగా టాటా గ్రూప్‌.. జెట్‌ ఎయిర్‌వేస్‌లో మేనేజ్‌మెంట్‌ నియంత్రణ అధికారాన్ని కోరుకుటోంది. జెట్‌ ఎయిర్‌వేస్‌లో టాటా గ్రూప్‌ కనీసం 26 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. అలాగే ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా మరో 26 శాతం వాటాను దక్కించుకునే అవకాశముంది. టాటా గ్రూప్‌ ముందుకు వస్తే జెట్‌ ఎయిర్‌వేస్‌లో తనకున్న 24 శాతం వాటాను (మొత్తంగా కానీ, కొంత భాగం కానీ) ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ విక్రయించొచ్చు. అయితే జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ వార్తలను కొట్టిపారేసింది. ఇరు కంపెనీల మధ్య చర్చలు అనే వార్త పూర్తిగా ఊహాజనితమని తెలిపారు. 

కాగా టాటా సన్స్‌ ఇప్పటికే విమానయాన రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో జాయింట్‌ వెంచర్‌ ద్వారా విస్తారాను, ఏయిర్‌ ఏషియా బెర్హాద్‌తో జాయింట్‌ వెంచర్‌ ద్వారా ఎయిర్‌ ఏషియా ఇండియాను నడుపుతోంది. ఒకవేళ జెట్‌ ఎయిర్‌వేస్‌తో డీల్‌ విజయవంతమైతే అప్పుడు ఏవియేషన్‌ వ్యాపారంలో నెట్‌వర్క్‌, మార్కెట్‌ పరంగా టాటా గ్రూప్‌ మరింత బలోపేతం కానుంది. ఎయిరిండియాను దక్కించుకుందామని టాటా గ్రూప్‌ భావించినప్పటికీ చివరకు అది కుదరలేదు.

జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ తన ఉద్యోగులకు వేతనాలను కూడా చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 



You may be interested

హువావే ‘మేట్‌ 20’ సిరీస్‌లో 4 స్మార్ట్‌ఫోన్స్‌

Thursday 18th October 2018

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘హువావే’ తాజాగా ‘మేట్‌ 20’ సిరీస్‌లో నాలుగు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ‘హువావే మేట్‌ 20’, ‘హువావే మేట్‌ 20 ప్రో’, ‘హువావే మేట్‌ 20 ఎక్స్‌’, ‘హువావే మేట్‌ 20 ఆర్‌ఎస్‌ పోర్షే డిజైన్‌’ అనేవి వీటి పేర్లు. కంపెనీ వీటిల్లో తొలిసారిగా 7 ఎన్‌ఎం కిరిన్‌ 980 ప్రాసెసర్‌ను ఉపయోగించింది. అలాగే రెండో జనరేషన్‌ లైకా

మెటల్స్‌, మైనింగ్‌ షేర్లు ఆకర్షిస్తున్నాయ్‌!!

Thursday 18th October 2018

నీతి ఆయోగ్‌ ఇటీవల్ల పీఎంవోకు పలు ప్రతిపాదనలు అందించినట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. వీటి ప్రకారం నీతి ఆయోగ్‌ చేసిన ప్రతిపాదనలు గమనిస్తే.. ♦ ఐరన్‌ ఓర్‌, అల్యూమినియం, కాపర్‌ దిగుమతులపై సుంకాలను పెంచాలి. ♦ ఐరన్‌ ఓర్‌ ఎగుమతులపై సుంకాలను తగ్గించాలి. ♦ కర్నాటక నుంచి ఐరన్‌ ఓర్‌ ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలి. ఈ ప్రతిపాదనల ఆధారంగా వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు కేంద్ర వాణిజ్య శాఖ తగిన నిర్ణయాలు తీసుకోనుంది. నీతి ఆయోగ్‌ ప్రతిపాదనల వల్ల పలు కంపెనీలకు

Most from this category