టాటా ఎలెక్సీ అమ్మకాలు రూ.403 కోట్లు
By Sakshi

ముంబై: టాటా గ్రూప్‌కు చెందిన ఐటీ కంపెనీ, టాటా ఎలెక్సీ నికర అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.403 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే క్వార్టర్లో సాధించిన నికర అమ్మకాలతో (రూ.342 కోట్లు) పోలిస్తే 17 శాతం వృద్ధి సాధించామని టాటా ఎలెక్సీ తెలిపింది. నికర లాభం రూ.57 కోట్ల నుంచి 44 శాతం వృద్ధితో రూ.82 కోట్లకు ఎగసిందని పేర్కొంది. ఎబిట రూ.78 కోట్ల నుంచి 30 శాతం పెరిగి రూ.101 కోట్లకు చేరిందని తెలిపింది. ఎబిట మార్జిన్ 29.90 శాతం నుంచి 32.30 శాతానికి పెరిగిందని తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.9.19గా ఉన్న షేర్ వారీ ఆర్జన (ఈపీఎస్) ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.13.20కు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాలు బాగానే ఉన్నా బీఎస్ఈలో టాటా ఎలెక్సీ షేర్ 12 శాతం నష్టపోయి రూ.1,007 వద్ద ముగిసింది.
You may be interested
మహీంద్రా నుంచి కొత్త ఈక్విటీ ఫండ్
Tuesday 9th October 2018హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ అయిన మహీంద్రా మ్యూచువల్ ఫండ్ మార్కెట్లోకి కొత్త రకం ఈక్విటీ పథకాన్ని విడుదల చేసింది. ‘మహీంద్రా రూరల్ భారత్ అండ్ కన్సప్షన్ యోజన’ పేరిట ఆరంభిస్తున్న ఈ ఈక్విటీ ఫండ్ పథకం సబ్స్క్రిప్షన్ ఈ నెల 19న ఆరంభమై నవంబర్ 2న ముగుస్తుంది. దీర్ఘకాలక మూలధన వృద్ధి కోరుకునే ఇన్టెసర్లకు ఈ పథకం మంచి అవకాశమని
15 నుంచి గోల్డ్ బాండ్స్ స్కీమ్
Tuesday 9th October 2018ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సార్వభౌమ పసిడి బాండ్ల పథకం అక్టోబర్ 15న ప్రారంభం కానుంది. అక్టోబర్ 19 దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. 23న బాండ్ల జారీ ఉంటుంది. ఫిబ్రవరి దాకా మొత్తం అయిదు విడతల్లో బాండ్ల జారీ ఉండనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. తదుపరి విడతల తేదీలు నవంబర్ 5-19 (నవంబర్ 13న జారీ), డిసెంబర్ 24-28 (జారీ జనవరి 1), జనవరి 14-18 (జారీ జనవరి