STOCKS

News


జియో ట్యారిఫ్‌లు పెరగనట్లే..

Saturday 27th October 2018
news_main1540609348.png-21507

న్యూఢిల్లీ: దేశీ టెలికాం రంగం మరింత మంది కస్టమర్లను చేరుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మొబైల్‌ టారిఫ్‌ల పెంపు కుదరదని రిలయన్స్‌ జియో ప్రెసిడెంట్‌ మాథ్యూ ఊమెన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ 40 కోట్ల మంది ఫీచర్‌ ఫోన్లనే వాడుతున్నారని, వీరిని చేరుకోవాలంటే.. కంపెనీలు టారిఫ్‌లను పెంచకుండానే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గిగాబైట్‌ వ్యయం తగ్గించడం, పెంచడం అనేది ఇక్కడ విషయం కాదని.. ఆవిష్కరణలతో ముందుకు కొనసాగే సంస్థలకే మనుగడ ఉంటుందని చెప్పారాయన. ఇక 2021 నుంచి అందుబాటు ధరలతో 5జీ టెక్నాలజీని అందించనున్నామని వెల్లడించారు.



You may be interested

బ్యాంకింగ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు అవసరం

Saturday 27th October 2018

న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ నిబంధనలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. మొండిబాకీలు పేరుకుపోయిన బ్యాంకులపై ప్రయోగించిన సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) నిబంధనలను సడలించాలని రిజర్వ్ బ్యాంకును కేంద్రం కోరడం లేదని ఆయన వివరించారు. "నిబంధనలన్నింటినీ సడలించేస్తే.. ఏ వ్యవస్థా నిరంతరం ఒంటికాలిపైనే నిలబడలేదు. చర్చ అంతా కూడా మన నియంత్రణ విధానాలు అంతర్జాతీయ

మొబైల్‌ కనెక్షన్లకు ఆధార్‌ ఈ–కేవైసీ వాడొద్దు

Saturday 27th October 2018

న్యూఢిల్లీ: పాత, కొత్త మొబైల్‌ కనెక్షన్లకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ విధానంలో యూజర్ల గుర్తింపు, చిరునామాల ధృవీకరణ కోసం (ఈ–కేవైసీ) ఆధార్‌ను ఉపయోగించరాదంటూ టెలికం సంస్థలను కేంద్రం ఆదేశించింది. వినియోగదారు స్వచ్ఛందంగా ఇచ్చిన పక్షంలో కేవైసీ కోసం పేపరు రూపంలోని ఆధార్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించింది. ఈ నిబంధనల అమలుపై నవంబర్‌ 5లోగా నివేదిక ఇవ్వాలని టెలికం శాఖ శుక్రవారం ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ప్రైవేట్‌ సంస్థలు ఆధార్‌ను వినియోగించడంపై ఆంక్షలు

Most from this category