STOCKS

News


తాన్లా సొల్యూషన్స్‌ ‘ట్రూబ్లాక్‌’

Wednesday 27th February 2019
news_main1551241730.png-24353

క్లౌడ్‌ కమ్యూనికేషన్‌ ప్రొవైడర్‌ తాన్లా సొల్యూషన్స్‌ టెలికం రంగంలో సంచలనానికి తెరలేపుతూ బ్లాక్‌చైన్‌ ఆధారిత టెక్నాలజీ ‘ట్రూబ్లాక్‌’ను ఆవిష్కరించింది. దీని ప్రత్యేకత ఏమంటే అవాంచిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లను మొబైల్‌ కస్టమర్లు స్వయంగా నియంత్రించవచ్చు. స్పామ్‌, మోసాల నుంచి కట్టడి చేసేందుకు టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లకు వీలవుతుంది. అలాగే డేటా ప్రైవసీ ఉంటుంది. వాణిజ్యపర కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల విషయంలో వినియోగదారు సమ్మతి, ప్రాధాన్యతను నమోదు చేస్తారు. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) నూతన నిబంధనలకు అనుగుణంగా డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీపై దీనిని అభివృద్ధి చేశారు. ట్రూబ్లాక్‌ను భారత్‌లో తొలుతగా వొడాఫోన్‌ ఐడియా వినియోగిస్తోంది. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ వేదికగా ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌.ఎస్‌.శర్మ ట్రూబ్లాక్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాన్లా సొల్యూషన్స్‌ సీఎండీ ఉదయ్‌ రెడ్డి మాట్లాడుతూ టెలికం రంగానికి ట్రూబ్లాక్‌ ఒక సంచలన ఆవిష్కరణగా అభివర్ణించారు. ప్రపంచంలో ఈ స్థాయిలో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని వినియోగించడం ఇదే తొలిసారి అని వివరించారు.



You may be interested

ద్రవ్యలోటు ఆందోళన!

Wednesday 27th February 2019

- లక్ష్యం 6.34 లక్షల కోట్లు  - జనవరి నాటికే 7.70 లక్షల కోట్లు - ఆర్థిక సంవత్సరంలో మరో 2 నెలలు - లక్ష్యాన్ని దాటనివ్వమంటున్న కేం‍ద్రం న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు - వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు లెక్కలు ప్రస్తుతానికి ఆందోళన సృష్టిస్తున్నాయి. కేంద్రం మంగళవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... - ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్ - 2019 మార్చి) మధ్య  ద్రవ్యలోటు 6.24 లక్షల కోట్లుగా ఉండాలని

మరో రెండు బ్యాంకులు పీసీఏ నుంచి బైటికి

Wednesday 27th February 2019

వాచ్ లిస్ట్ నుంచి బైటపడ్డ అలహాబాద్ బ్యాంక్‌, కార్పొరేషన్ బ్యాంక్‌ ముంబై: మొండిబాకీల భారం కారణంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధి నుంచి బైటికొచ్చాయి. అలహాబాద్‌ బ్యాంక్‌, కార్పొరేషన్ బ్యాంక్‌లపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఆర్‌బీఐ మంగళవారం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రైవేట్ రంగానికి చెందిన ధన్‌లక్ష్మి బ్యాంక్‌ కూడా పీసీఏ నుంచి బైటికొచ్చింది. ఆయా బ్యాంకుల

Most from this category