STOCKS

News


మరింత పెరిగిన సిండికేట్‌ బ్యాంకు నష్టాలు

Tuesday 7th August 2018
news_main1533618858.png-18998

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని సిండికేట్‌ బ్యాంకు నష్టాలు జూన్‌ త్రైమాసికంలో మరింత విస్తృతం అయ్యాయి. రూ.1,282 కోట్ల నష్టాన్ని బ్యాంకు ఈ కాలంలో చవిచూసింది. గతేడాది ఇదే కాలంలో నష్టం రూ.263 కోట్లుగా ఉంది. ఆదాయం సైతం రూ.5,637 కోట్లకు క్షీణించింది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ.6,171 కోట్లు. వడ్డీ ఆదాయం రూ.5,484 కోట్ల నుంచి రూ.5,257 కోట్లకు తగ్గిపోయింది. అలాగే, ఆర్‌బీఐ వద్ద, ఇతర ఇంటర్‌ బ్యాంకు వేదికల వద్దనున్న నిధులపై వడ్డీ ఆదాయంలోనూ గణనీయమైన తగ్గుదల ఉంది. ఆస్తుల నాణ్యత మరింత క్షీణించింది. స్థూల ఎన్‌పీఏలు ఈ ఏడాది జూన్‌ నాటికి 12.59 శాతానికి (రూ.26,361 కోట్లు) పెరిగిపోయాయి. గతేడాది ఇదే కాలం నాటికి 9.96 శాతం (రూ.20,183 కోట్లు) ఉండగా, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలోనూ 11.53 శాతంగానే ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు 6.27 శాతం (రూ.12,188 కోట్లు) నుంచి 6.64 శాతాని(రూ.13,010 కోట్లు)కి పెరిగాయి. ఎన్‌పీఏలు పెరగడంతో వీటి కోసం బ్యాంకు జూన్‌ త్రైమాసికంలో రూ.1,774 కోట్లు పక్కన పెట్టడం నష్టాలకు దారితీసింది.



You may be interested

వేదాంత రీసోర్సెస్‌ ఎబిటాలో 26 శాతం వృద్ధి

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: వేదాంత రీసోర్సెస్‌ ఎబిటా జూన్‌ క్వార్టర్లో 26 శాతం పెరిగి 983 మిలిన్‌ డాలర్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో ఇది 778 మిలియన్‌ డాలర్లు కావడం గమనార్హం. త్రైమాసిక ఫలితాలను కంపెనీ లండన్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌కు సమర్పించింది. వేదాంత లిమిటెడ్‌కు ఇది మాతృ సంస్థ. కమోడిటీ ధరలు అధికంగా ఉండడం, అధిక విక్రయాలతో ఎబిటా వృద్ధి చెందినట్టు కంపెనీ తెలిపింది. గ్రూపు ఆదాయం 14.9 శాతం పెరిగి

అదానీ పవర్‌కు పీఎల్‌ఎఫ్‌ షాక్‌

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: అదానీ పవర్‌ కంపెనీ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో మరింతగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.453 కోట్లుగా ఉన్న నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 82 శాతం పెరిగి రూ.825 కోట్లకు చేరాయి. మొత్తం ఆదాయం కూడా తగ్గిందని అదానీ పవర్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.5,601 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.3,959 కోట్లకు చేరిందని

Most from this category