STOCKS

News


సిండికేట్‌ బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ పెంపు

Thursday 11th October 2018
news_main1539231426.png-21028

న్యూఢిల్లీ: మూడు నెలల కాలపరిమితికి సంబంధించి ఎంసీఎల్‌ఆర్‌ (నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు)ను సిండికేట్ బ్యాంక్‌ స్వల్పంగా 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెంచింది.  దీనితో మూడు నెలల కాలపరిమితి రుణాలపై వడ్డీరేట్ల 8.40 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. అక్టోబర్‌ 10వ తేదీ నుంచీ తాజా రేటు అమల్లో‍కి వస్తుంది. కాగా ఓవరనైట్‌ (8.30), నెల (8.35), ఆరు నెలలు (8.60), ఏడాది (8.80) రేట్లు మాత్రం యథాతథంగా ఉన్నాయి. 

ఓబీసీ కూడా...
పలు కాలపరిమితులకు సంబంధించి ఓబీసీ కూడా ఎంసీఎల్‌ఆర్‌ను 0.10 బేసిస్‌ పాయింట్ల వరకూ పెంచింది. గురువారం నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. రిటైల్‌ రుణాలకు బెంచ్‌మార్క్‌గా పేర్కొనే ఏడాది కాలపరిమితి రుణరేటు 8.65 శాతం నుంచి 8.75 శాతానికి పెరిగింది. అలాగే ఆరు నెలలు (8.70 శాతం), మూడు నెలలు (8.50 శాతం), నెల (8.45 శాతం) రుణ రేట్లు కూడా 0.10 శాతం పెరిగాయి. ఓవర్‌నైట్‌కు సంబంధించి రుణ రేటు 8.30 శాతానికి పెరిగింది. 



You may be interested

మహిళల సేఫ్టీ కోసం వొడాఫోన్‌ సఖి

Thursday 11th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా ‘వొడాఫోన్‌ సఖి’ పేరుతో మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని మొబైల్‌ ఆధారిత సేఫ్టీ సర్వీసులను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. బ్యాడ్మింటన్‌ స్టార్‌ పి.వి.సింధు చేతుల మీదుగా సఖిని ఆవిష్కరించారు. ఫోన్లో బ్యాలెన్స్‌, ఇంటర్నెట్‌ లేకున్నా ఈ ఉచిత సేవలు పనిచేయడం విశేషం. సఖి సర్వీసులకై 1800123100 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయాల్సి ఉంటుంది. అత్యవసర సమయంలో కస్టమర్‌ ఉన్న ప్రాంతం (లొకేషన్‌) వివరాలు

నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ డౌన్‌..

Thursday 11th October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో గురువారం నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ కూడా మినహాయింపేమీ దక్కలేదు. మిగతా సెక్టోరల్‌ ఇండెక్స్‌ల బాటలోనే నిఫ్టీ ఐటీ కూడా పతనమైంది. దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్‌ క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడి కానుండటం, రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయిలకు పతనం కావడం వంటి అంశాలు కూడా సానుకూల ప్రభావం చూపలేకపోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ గురువారం ఉదయం 9:42 సమయంలో 2.56 శాతంమేర పతనమైంది. 14,755

Most from this category