STOCKS

News


ఎస్‌బీఐ లైఫ్‌ - సిండికేట్‌ బ్యాంక్‌ జట్టు

Thursday 3rd January 2019
news_main1546493077.png-23381

  • రెండింటి మధ్య బ్యాంక్‌ అష్యూరెన్స్‌ ఒప్పందం

బెంగళూరు: సిండికేట్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ల మధ్య బ్యాంకష్యూరెన్స్‌ ఒప్పందం కుదిరింది. ఖాతాదారులకు సమగ్రమైన ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ సొల్యూషన్‌ను అందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు వెల్లడించాయి. ఈ ఒప్పందంపై సిండికేట్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ మృత్యుంజయ్‌ మహాపాత్ర, ఎస్‌బీఐ లైఫ్‌  సీఈఓ, ఎమ్‌డీ సంజీవ్‌ నౌతియాల్‌ సంతకాలు చేశారు. దేశవ్యాప్తంగా 3,000 బ్రాంచ్‌లతో సేవలందిస్తున్న సిండికేట్‌ బ్యాంక్‌ తన బ్రాంచ్‌ల ద్వారా ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు చెందిన వివిధ పాలసీలను విక్రయిస్తుంది.
ఎసాప్స్‌ ద్వారా రూ.500 కోట్లు...
ఎంప్లాయీ స్టాక్‌ పర్చేజ్‌ స్కీమ్‌ (ఎసాప్స్‌) కింద ఉద్యోగులకు షేర్లు జారీ చేసి రూ.500 కోట్లు సమీకరించనున్నామని సిండికేట్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ నెల 7న జరిగే కాంపెన్సేషన్‌ కమిటీ దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తుందని పేర్కొంది.



You may be interested

చిన్న పరిశ్రమల వృద్ధిపై ఆర్‌బీఐ దృష్టి

Thursday 3rd January 2019

సిన్హా నేతృత్వంలో నిపుణలు కమిటీ వచ్చేవారం ఈ రంగం ప్రతినిధులతో ఆర్‌బీఐ గవర్నర్‌ భేటీ ముంబై: లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధిపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  మరింత దృష్టి సారిస్తోంది. ఈ రంగం అభివృద్ధిపై సలహాలకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే ఈ రంగం ప్రతినిధులతో వచ్చేవారం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ సమావేశం కానున్నారు.  నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) ప్రతినిధులతో

నిర్మాణంలోని ఇళ్లు, ఫ్లాట్లపై జీఎస్టీ తగ్గింపు?

Thursday 3rd January 2019

- 5 శాతానికి పరిమితం చేసే అవకాశం - ఈ నెల 10న జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో నిర్ణయం? రూ.75 లక్షలలోపు టర్నోవరుండే వ్యాపారులకు మినహాయింపు కూడా!! న్యూఢిల్లీ: నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఫ్లాట్లపై జీఎస్టీని 5 శాతానికి పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనపై జీఎస్టీ కౌన్సిల్‌ ఈ నెల 10న జరిగే భేటీలో నిర్ణయం తీసుకుంటుందని విశ్వసనీయంగా తెలిసింది. డిసెంబర్‌ 22న జరిగిన చివరి సమావేశంలో కౌన్సిల్‌ 23 రకాల

Most from this category