STOCKS

News


స్విగ్గీలో కార్లైల్‌ గ్రూప్‌ పెట్టుబడులు!

Wednesday 19th June 2019
news_main1560940377.png-26423

అమెరికా కంపెనీ కార్లైల్‌, స్విగ్గీలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడుతోంది. స్విగ్గీలో కార్లైల్‌ గ్రూప్‌ 20 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్విగ్గీలో ఇన్వెస్ట్‌ చేస్తే కార్లైల్‌కు ఇది ఇండియాలో రెండో పెట్టుబడి కానుంది. బెంగుళూరు కంపెనీ డెలివరీలో కార్లైల్‌ 2017లో పెట్టుబడులు పెట్టింది. స్విగ్గీ 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను గత ఏడాది డిసెంబర్‌లో సాధించింది. స్విగ్గీలో పెట్టుబడి దారుగా ఉన్న నస్పర్స్‌ లిమిటెడ్‌ నాయకత్వంలో జరిగిన ఈ ఫండింగ్‌ రౌండ్‌ పుడ్‌ టెక్‌ రంగంలోనే అతి పెద్దదిగా చెప్పుకోవచ్చు. 3.3 బిలియన్‌ డాలర్‌లగా ఉన్న సంస్థ విలువ కార్లైల్‌ ఫండింగ్‌ తర్వాత 4.5 బిలియన్‌ డాలర్లకు పెరిగనుంది. ‘గత రెండు సంవత్సరాలలో స్విగ్గీ వేగంగా వృద్ధి చెందుతోంది. పెట్టుబడిదారులను, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌లను ఇది ఆకర్షిస్తోంది. పెట్టుబడిదారులు దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు’ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 మొదలైన ఈ బెంగుళూరు కంపెనీ పుడ్‌టెక్‌ రంగంలో దిగ్గజంగా ఎదిగింది. స్విగ్గీలో ఇప్పటికే డీఎస్‌టీ గ్లోబల్‌, దక్షిణ ఆఫ్రిక కంపెనీ నస్పర్స్‌, న్యూయార్క్‌ కంపెనీ హెడ్జ్‌ ఫండ్‌ కొట్యూ మానేజ్‌మెంట్‌,  యాక్సెల్‌, నార్వెస్ట్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. అంతే కాకుండా 300-500మిలియన్‌ డాలర్ల పెట్టుబడుల కోసం జపాన్‌ పెట్టుబడిదారి సంస్థ సాఫ్ట్‌బ్యాంక్‌తో స్విగ్గీ, జొమాటోలు ప్రయత్నించాయని, కానీ సాఫ్ట్‌బ్యాంక్‌ స్విగ్గీ వైపు ఆసక్తిగా ఉందని వార్తలు వస్తున్నాయి.
 



You may be interested

ఆద్యంతం ఊగిసలాట.. ఆఖరులో ఫ్లాట్‌ ముగింపు

Wednesday 19th June 2019

554 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌  కుప్పకూలిన మిడ్‌ క్యాప్‌ షేర్లు ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో సూచీలు విఫలమడంతో మార్కెట్‌ బుధవారం స్వల్ప లాభంతో సరిపెట్టుకుంది. సెన్సెక్స్‌ 66.40 పాయింట్ల లాభంతో 39,112 వద్ద ముగిసింది. నిఫ్టీ ఎలాంటి లాభ నష్టాలు లేకుండా ఫ్లాట్‌గా గత ముగింపు స్థాయి 11,691 వద్ద స్థిరపడింది. మిడ్‌ సెషన్‌ నుంచి అటో, బ్యాంకింగ్‌, ఫార్మా, ఐటీ షేర్లలో అమ్మకాలతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ముఖ్యంగా

జీఎస్‌టీ రేట్‌కట్‌కు అవకాశాలు తక్కువే!

Wednesday 19th June 2019

డెల్లాయిట్‌ ఇండియా ప్రతినిధి ఎంఎస్‌ మణి అంచనా ఇప్పుడున్న పరిస్థితుల్లో జీఎస్‌టీ రేట్‌ కట్‌కు అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయని డెల్లాయిట్‌ ఇండియా(పరోక్ష పన్నుల విభాగం) ప్రతినిధి ఎంఎస్‌ మణి అభిప్రాయపడ్డారు. గతేడాది కాలంలో జీఎస్‌టీ వసూళ్లు ప్రభుత్వ అంచనాల కన్నా తక్కువగా ఉంటున్నాయని, కేవలం గత మూడు నెలల్లో మాత్రమే ఈ వసూళ్లు స్థిరంగా ఉంటున్నాయని చెప్పారు. ప్రస్తుత నెలకు లక్ష కోట్ల రూపాయల వసూళ్లు ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్లో

Most from this category