STOCKS

News


43 శాతం తగ్గిన సువెన్‌ లాభం

Thursday 15th November 2018
news_main1542258525.png-22025

సెప్టెంబరు క్వార్టరు స్టాండలోన్‌ ఫలితాల్లో సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే 43 శాతం తగ్గి రూ.18 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.112 కోట్ల నుంచి రూ.96 కోట్లకు వచ్చి చేరింది. ఏప్రిల్‌-సెప్టెంబరులో రూ.296 కోట్ల టర్నోవరుపై రూ.57 కోట్ల నికరలాభం ఆర్జించింది. బీఎస్‌ఈలో బుధవారం కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 1.92 శాతం తగ్గి రూ.247.75 వద్ద స్థిరపడింది.



You may be interested

ట్రూజెట్‌... చిల్డ్రన్స్‌ డే ప్రయాణం!

Thursday 15th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విమానయాన రంగ సంస్థ ‘ట్రూజెట్‌’ పేద పిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. 40 మంది పిల్లలను బుధవారం ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి సేలంకు తీసుకెళ్లింది. వీరంతా తమిళనాడుకు చెందిన ఎస్‌ఆర్‌వీవీ పాఠశాల విద్యార్థులు. వెల్లప సెంబనా గౌండర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ సాయంతో పిల్లలకు విమానయాన అవకాశం కలిగింది. ‘వింగ్స్‌ ఆఫ్‌ హోప్‌’ కార్యక్రమం కింద ఏటా 300 మంది

47 శాతం పెరిగిన ఎంఎస్‌ఆర్‌ లాభం

Thursday 15th November 2018

సెప్టెంబరు క్వార్టరులో ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే 47 శాతం పెరిగి రూ.84 లక్షలుగా నమోదైంది. టర్నోవరు రూ.47.5 కోట్ల నుంచి రూ.52 కోట్లకు చేరింది. ఏప్రిల్‌-సెప్టెంబరు పీరియడ్‌లో రూ.87 కోట్ల టర్నోవరుపై రూ.1.37 కోట్ల నికరలాభం సాధించింది. బుధవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 3.96 శాతం అధికమై రూ.15.50 వద్ద స్థిరపడింది.

Most from this category