News


సువెన్‌ చేతికి రైజింగ్‌ ఫార్మా ఆస్తులు

Saturday 9th March 2019
Markets_main1552118460.png-24514

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: బయో ఫార్మాస్యూటికల్‌ కంపెనీ సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌... యూఎస్‌ సంస్థ ఎసిటో కార్పొరేషన్‌కు చెందిన రైజింగ్‌ ఫార్మాస్యూటికల్స్‌తోపాటు అనుబంధ కంపెనీల ఆస్తులను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ.105 కోట్లు చెల్లించేందుకు సువెన్‌ అంగీకరించిందని ఎసిటో వెల్లడించింది. ఎసిటో దివాలా తీయడంతో కోర్టు ఆమోదించిన బిడ్డింగ్‌ విధానంలో ఆస్తులను విక్రయిస్తోంది. సువెన్‌ లైఫ్‌ జేవీ అయిన షోర్‌ సువెన్‌ ఫార్మా ద్వారా ఈ కొనుగోలు చేస్తోంది. ఈ డీల్‌ ద్వారా యూఎస్‌లో షోర్‌ సువెన్‌ పటిష్టమైన జనరిక్‌ ఫార్మా కంపెనీగా మారుతుందని సువెన్‌ లైఫ్‌ సీఈవో వెంకట్‌ జాస్తి తెలిపారు.



You may be interested

పుంజులాయిడ్‌ దివాలాకు ఎన్‌సీఎల్‌టీ ఓకే!

Saturday 9th March 2019

న్యూఢిల్లీ: ఇంజనీరింగ్‌, నిర్మాణ రంగం కంపెనీ పుంజ్‌లాయిడ్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీకి వ్యతిరేకంగా ఐసీఐసీఐ బ్యాంకు దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ ఆమోదించింది. రూ.853.83 కోట్ల రుణ బకాయిలను పుంజ్‌లాయిడ్‌ చెల్లించకపోవడంతో, ఐసీఐసీఐ బ్యాంకు ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా, ఇద్దరు సభ్యుల ఎన్‌సీఎల్‌టీ ఢిల్లీ బెంచ్‌ అనుమతించింది. ఎన్‌సీఎల్‌టీ పూర్తి ఆదేశాల కాపీ తమకు అందాల్సి ఉందని, ఆ తర్వాతే

రేటింగ్‌ ఏజెన్సీల పాత్ర కీలకం: ఆర్‌బీఐ గవర్నర్‌

Saturday 9th March 2019

ముంబై: ఫైనాన్షియల్‌ రంగ స్థిరత్వంలో... అవి సమర్థంగా పనిచేయడంలో రేటింగ్‌ ఏజెన్సీలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. భాగస్వాములతో సంప్రతింపుల కార్యక్రమంలో భాగంగా క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీల ఉన్నతోద్యోగులతో ఆర్‌బీఐ గవర్నర్‌ సమావేశమై చర్చించారు. ‘‘ఫైనాన్షియల్‌ సెక్టార్‌ సమర్థవంతంగా, సుస్థిరంగా పనిచేయడంలో క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భాగస్వాముల సంప్రతింపుల్లో భాగంగా గురువారం క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీల ఎండీ, సీఈవోలతో సమావేశమయ్యాను’’

Most from this category