News


వేదాంతాకు సుప్రీంలో చుక్కెదురు!

Tuesday 19th February 2019
news_main1550561477.png-24257

  • వేదాంతాకు సుప్రీంలో చుక్కెదురు!
  • ట్యుటికొరిన్‌ ప్లాంటు పునఃప్రారంభానికి నో
  • జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు కొట్టివేత
  • హైకోర్టుకు వెళ్లవచ్చని వేదాంతాకు సూచన

న్యూఢిల్లీ: తమిళనాడులోని ట్యుటికోరిన్‌లో స్టెరిలైట్‌ కర్మాగారాన్ని పునఃప్రారంభానికి అత్యున్నత న్యాయస్థానం రెడ్‌ సిగ్నల్‌ వేసింది. ఈ మేరకు నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎస్‌జీటీ) ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. దీనీతో ఈ ప్లాంట్‌ పునఃప్రారంభానికి వేదాంతా చేస్తున్న తక్షణ ప్రణాళికలకు విఘాతం ఏర్పడినట్లయ్యింది. అయితే ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లవచ్చని సుప్రీంకోర్టు సూచించడం వేదాంతాకు కొంత ఊరటనిచ్చే అంశం. వివరాల్లోకి వెళితే... ఈ ప్లాంట్‌ తీవ్ర కాలుష్యానికి కారణమంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. మే 22న జరిగిన ఆందోళనల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఈ ప్లాంట్‌ను మూసివేస్తూ, తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అయితే నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఈ ప్లాంట్‌ పునఃప్రారంభానికి ఉత్తర్వులిచ్చింది. దీనితో ట్రైబ్యునల్‌కు వ్యతిరేకంగా తమిళనాడు దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన ఆర్‌ఎఫ్‌ నారీమన్‌ నేతృత్వం‍లోని బెంచ్‌, గ్రీన్‌ ట్రైబ్యునల్‌ రూలింగ్‌ను తోసిపుచ్చింది. ప్లాంట్‌ పునఃప్రారంభానికి ఉత్తర్వులిచ్చే న్యాయ పరిధి ట్రైబ్యునల్‌కు లేదని పేర్కొంది. ఇదే కారణంతో ట్రైబ్యునల్‌ రూలింగ్‌ను తోసిపుచ్చుతున్నట్లు  పేర్కొంది. అయితే వేదాంతా ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లవచ్చని సుప్రీం సూచించింది.


‍ప్రభుత్వం హర్షం...
ట్యుటి‍కోరిన్ జిల్లా కలెక్టర్‌ సందీప్‌ నండూరి సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్లాంట్‌ మూసే ఉంటుందని అన్నారు. 


తీర్పు అధ్యయనం: స్టెరిలైట్‌
సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్నట్లు స్టెరిలైట్‌ కాపర్‌ పేర్కొంది. తమ న్యాయవాద బృందం సలహాతో భవిష్యత్‌ చర్యలు తీసుకుంటామని పేర్కొంది.You may be interested

డీజిల్ కార్లకు ఇక చెల్లు చీటీ?

Tuesday 19th February 2019

నిలిపివేతపై చర్చల్లో మారుతీ సుజుకీ సీఎన్‌జీ కార్లపై దృష్టి పెట్టాలన్న యోచన పెట్రోల్ వెర్షన్లపై మహీంద్రా కసరత్తు కఠినతర కాలుష్య ప్రమాణాలే కారణం న్యూఢిల్లీ: పెట్రోల్‌తో పోలిస్తే కాస్త ఎక్కువ మోతాదులో కాలుష్యకారక వాయువులు విడుదల చేసే డీజిల్‌ ఇంధన వినియోగంపై నియంత్రణలు పెరుగుతున్న నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు వ్యూహాలు మార్చుకుంటున్నాయి. పరిస్థితి బట్టి డీజిల్ కార్ల ఉత్పత్తిని కూడా నిలిపివేసే అంశాలనూ పరిశీలిస్తున్నాయి. దేశీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇదే అంశంపై మాతృ సంస్థ

విలీనమైనా కూడా మా చేతిలోనే!!

Tuesday 19th February 2019

తుది దశలో లావాదేవీ ప్రక్రియ  ఆర్‌ఈసీపై కేంద్రం స్పష్టీకరణ ముంబై:  రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కంపెనీని (ఆర్‌ఈసీ) పీఎఫ్‌సీ టేకోవర్‌ చేసినప్పటికీ, ఆర్‌ఈసీ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ టేకోవర్‌ తుది దశలో ఉందని, లావాదేవీ ధర ఇంకా నిర్ణయం కాలేదని విద్యుత్తు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అరుణ్‌ కుమార్‌ వర్మ చెప్పారు. వచ్చే నెల 31లోపు ఈ లావాదేవీ పూర్తికావచ్చన్నారు. మైనారిటీ వాటా కొనుగోలు కోసం

Most from this category