STOCKS

News


ఫిబ్రవరి 28న వ్యక్తిగతంగా హాజరవ్వండి

Friday 1st February 2019
news_main1549008538.png-23946

  • సహారా చీఫ్‌కు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: సహారా చీఫ్‌ సుబ్రతా రాయ్‌, ఇతర డైరెక్టర్లు ఫిబ్రవరి 28వ తేదీన అత్యున్నత న్యాయస్థానం- సుప్రీంకోర్టు ముందు హాజరుకానున్నారు. ఈ మేరకు గురువారం చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సహారాకు సంబంధించి రెండు అనుబంధ సంస్థలు- డిపాజిటర్ల నుంచి నిబంధలను వ్యతిరేకంగా నిధుల సమీకరణ, వీటి పునఃచెల్లింపుల్లో వైఫల్యం కేసు సుప్రీంకోర్టు ముందు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రూ.25,700 కోట్లు డిపాజిట్‌ చేయాలని సుప్రీం ఆదేశించింది. అయితే ఈ మొత్తం డిపాజిట్లలో సహారా వైఫల్యం చెందింది. మొత్తం డబ్బును సమకూర్చాల్సిందేనని ఆరు నెలల క్రితం సుప్రీంకోర్టు ఆదేశించింది.  అయితే ఇప్పటికి కేవలం రూ.15,000 కోట్లే డిపాజిట్‌ చేసినట్లు సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ పేర్కొన్నారు. ఈ కేసులో తీహార్‌ జైలులో గడిపిన రాయ్‌ తన  తల్లి మరణంతో అంతిమ సంస్కారాల కోసం జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే నిధులు సమకూర్చుకోడానికి తగిన అవకాశం కల్పించాలని కోరుతూ, జైలు వెలుపలే కొనసాగుతున్నారు.



You may be interested

వృద్ధి రేట్లు పెరిగాయ్‌...

Friday 1st February 2019

- 2016-17, 2017-18పై సవరణ గణాంకాలు న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించి గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల వృద్ధి రేట్లను కేంద్ర గణాంకాల శాఖ (సీఎస్‌ఓ) ఎగువ ముఖంగా సవరించింది. వీటిని క్లుప్తంగా చూస్తే... - 2017-18లో వృద్ధి రేటు తొలి గణాంకాల ప్రకారం 6.7 శాతం. తాజాగా ఈ రేటును 7.2 శాతానికి సవరించడం జరిగింది. వ్యవసాయ రంగంలో పంట ఉత్పత్తులకు సంబంధించి తాజా గణాంకాల సానుకూలత దీనికి

కొన్ని ప్రధాన కంపెనీల త్రైమాసిక ఫలితాలు

Friday 1st February 2019

78 శాతం పెరిగిన ఎన్‌ఎండీసీ లాభం మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ డిసెంబరు త్రైమాసికంలో ఉత్తమ ఫలితాలను నమోదు చేసింది. స్టాండలోన్‌ లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 78 శాతం పెరిగి రూ.1,577 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.2,580 కోట్ల నుంచి రూ.3,785 కోట్లకు ఎగసింది. ఇక గతేడాది ఏప్రిల్‌-డిసెంబరు కాలానికి రూ.8,901 కోట్ల టర్నోవర్‌పై రూ.3,188 కోట్ల నికరలాభం ఆర్జించింది. మోల్డ్‌టెక్‌ లాభం రూ.8 కోట్లు హైదరాబాద్, బిజినెస్‌

Most from this category