STOCKS

News


దక్షిణాదిన సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ ప్లాంటు

Thursday 17th January 2019
news_main1547699657.png-23629

- పరిశీలనలో తెలంగాణ, ఏపీ
- కంపెనీ సీఈవో అవనీత్‌ సింగ్‌

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: భారత్‌లో కొడాక్‌, థామ్సన్‌ బ్రాండ్ల టీవీల తయారీ లైసెన్సున్న ‘సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌’... మరో ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఉత్తరాదిన మూడు ప్లాంట్లున్న ఈ కంపెనీ నాల్గవ యూనిట్‌ను దక్షిణాదిన ఏర్పాటు చేస్తామని తెలియజేసింది. ఇందుకోసం ఏపీ, తెలంగాణ, తమిళనాడు పరిశీలనలో ఉ‍న్నాయని సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ సీఈవో అవనీత్‌ సింగ్‌ మార్వా బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘కొత్త ప్లాంటు వార్షిక సామర్థ్యం 2 లక్షల యూనిట్లు ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైతే ఎక్కువ ప్రోత్సాహకాలిస్తుందో అక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం కంపెనీ వార్షిక తయారీ సామర్థ్యం 9 లక్షల యూనిట్లపైనే. కొడాక్‌, థామ్సన్‌ బ్రాండ్లలో 2017-18లో 2.1 లక్షల యూనిట్లు విక్రయించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 4.8 లక్షల యూనిట్లకు చేరుతుంది. కొడాక్‌ బ్రాండ్‌లో 14 మోడళ్లున్నాయి. ఈ ఏడాది కొత్తగా 8 మోడళ్లు మార్కెట్లోకి విడుదల చేస్తాం. టీవీల విపణిలో సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌కు 4 శాతం మార్కెట్‌ వాటా ఉంది. 2022 నాటికి వాటాను రెండింతలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆన్‌లైన్‌లో ప్రస్తుతం టాప్‌-2 ప్లేయర్‌గా ఉన్నాం’ అని వివరించారు.



You may be interested

హెచ్‌యూఎల్‌ ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలు

Thursday 17th January 2019

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌ గురువారం క్యు3 ఫలితాలు ప్రకటించనుంది. వాల్యూం గ్రోత్‌, ఉత్పత్తుల ధరల పెంపుదలతో ఈ దఫా కంపెనీ మంచి ఫలితాలు ప్రకటించవచ్చని బ్రోకరేజ్‌లు భావిస్తున్నాయి. లాభాలు, రెవెన్యూ రెండంకెల వృద్ధి నమోదు చేయవచ్చని భావిస్తున్నాయి. క్యు3లో లాభాలు 6- 10 శాతం, రెవెన్యూ 10- 13 శాతం, లాభాల వృద్ధి 12- 20 శాతం పెరుగుదల చూపుతాయని అంచనా. వాల్యూంల్లో 10 శాతం, విక్రయాల్లో 12.5 శాతం

పరిశ్రమలపై ఆర్‌బీఐ గవర్నర్‌ దృష్టి

Thursday 17th January 2019

- నేడు కార్పొరేట్‌ అధిపతులతో శక్తికాంత్‌ భేటీ - ఇప్పటికే బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీలపై  చర్చలు - చిన్న పరిశ్రమల ప్రతినిధులనూ కలిసిన దాస్‌ ముంబై: దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరింత దృష్టి సారిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గురువారం పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. మైక్రోబ్లాగింగ్‌ వెబ్‌సైట్‌ ట్వీట్‌లో దాస్‌ ఈ వివరాలను

Most from this category