STOCKS

News


సన్‌ఫార్మా చేతికి జపాన్‌ పోలా ఫార్మా

Tuesday 27th November 2018
Markets_main1543297657.png-22402

  • డీల్‌ విలువ 10 లక్షల డాలర్లు 

న్యూఢిల్లీ: భారత ఫార్మా దిగ్గజం సన్‌ ఫార్మా... జపాన్‌కు చెందిన పోలా ఫార్మా కంపెనీని కొనుగోలు చేయనుంది. పోలా ఫార్మాను 10 లక్షల డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు సన్‌ ఫార్మా వెల్లడించింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.7 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా చర్మ సంబంధిత ఔషధాల సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకోవడం లక్ష్యంగా పోలా ఫార్మాను టేకోవర్‌ చేస్తున్నామని సన్‌ ఫార్మా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ కీర్తి గనోర్కార్‌ తెలిపారు. దీని కోసం పోలా ఫార్మాతో ఒక నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. ఈ కంపెనీ టేకోవర్‌ వచ్చే ఏడాది జనవరి 31 కల్లా పూర్తవుతుందని అంచనా వేశారు. పోలా ఫార్మా స్థానిక నైపుణ్యం, సన్‌ ఫార్మా అంతర్జాతీయ పటిష్టతలు కలగలసి జపాన్‌లో మరింత వృద్ధిని సాధిస్తామని సన్‌ ఫార్మా జపాన్‌ హెడ్‌ జునిచి నకమిచి వ్యాఖ్యానించారు.
పోలా ఫార్మా ఆదాయం 11 కోట్ల డాలర్లు...
పోలా ఫార్మా కంపెనీ జపాన్‌లో జనరిక్‌, బ్రాండెడ్‌ ఔషధాలకు సంబంధించి పరిశోధన, తయారీ, విక్రయం, మార్కెటింగ్‌  కార్యకలాపాలను సాగిస్తోంది. ప్రధానంగా చర్మ సంబంధిత ఔషధాలను ఈ కంపెనీ తయారు చేస్తోంది. ఈ కంపెనీకి జపాన్‌లో రెండు ప్లాంట్లున్నాయి. గత ఏడాదిలో ఈ కంపెనీ 11 కోట్ల డాలర్ల ఆదాయాన్ని, 70 లక్షల డాలర్ల నికర నష్టాన్ని చవిచూసింది.
సన్‌ ఫార్మా కంపెనీ జపాన్‌ ఫార్మా మార్కెట్లోకి 2016లో ప్రవేశించింది. నొవార్టిస్‌కు చెందిన 14 ప్రిస్క్రిప్షన్‌ బ్రాండ్ల కొనుగోళ్ల ద్వారా సన్‌ ఫార్మా జపాన్‌ మార్కెట్లోకి అడుగిడింది. జపాన్‌ ఫార్మా మార్కెట్‌ 8,480 కోట్ల డాలర్ల రేంజ్‌లో ఉంటుందని అంచనా. 1.13 లక్ష కోట్ల డాలర్ల ప్రపంచ ఫార్మా మార్కెట్లో జపాన్‌ ఫార్మా మార్కెట్‌ వాటా 7.5 శాతంగా ఉంది.



You may be interested

త్వరలో ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా ఐపీఓ

Tuesday 27th November 2018

- 8 మర్చంట్‌ బ్యాంకుల్ని నియమించిన కంపెనీ న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన ఆఫ్రికా విభాగం ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా లిమిటెడ్‌ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రానుంది. ఈ ఐపీఓకు మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి ఎనిమిది అంతర్జాతీయ బ్యాంక్‌లను ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా నియమించింది. జేపీ మోర్గాన్‌, సిటీ ​గ్రూప్‌, గోల్డ్‌మన్‌ శాచ్స్‌ ఇంటర్నేషనల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌, అబ్సా గ్రూప్‌ లిమిటెడ్‌, బార్‌క్లేస్‌ బ్యాంక్‌ పీఎల్‌సీ,

ఏసీలు, ఫ్రిజ్‌లూ మేకిన్‌ ఇండియా

Tuesday 27th November 2018

- దిగుమతులపై సుంకాల పెంపు ఎఫెక్ట్‌ - రూపాయి విలువ భారీ పతనం ప్రభావం కూడా... - వచ్చే రెండేళ్లలో రూ.6,500 కోట్లకు పైగా పెట్టుబడులు... - దేశీయంగా తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు విదేశీ కంపెనీల క్యూ.... ముంబై:- మోదీ సర్కారు మేకిన్‌ ఇండియా నినాదం స్మార్ట్‌ఫోన్లు... టీవీల తయారీ రంగంలో బాగానే పనిచేస్తోంది. ఈ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసేందుకు విదేశీ కంపెనీలన్నీ పెట్టుబడులకు ముందుకొచ్చాయి. మరి ఇప్పుడు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, ఎయిర్‌

Most from this category