News


3,000 కార్లను సమకూర్చుకుంటున్న డ్రైవెన్‌

Saturday 30th March 2019
news_main1553934880.png-24877

రూ.700 కోట్ల సమీకరణకు నిర్ణయం
త్వరలో షేర్‌డ్‌ మొబిలిటీ ‘ఈ-వీ’ సేవలు

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మల్టీ బ్రాండ్‌ లగ్జరీ కార్‌ సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసుల కంపెనీ కార్‌2డ్రైవ్‌ హైదరాబాద్‌లో తన సేవలను ప్రారంభించింది. సంప్రదాయ పద్ధతిలో కారు కొనుగోలుకు బదులు.. ఎటువంటి డౌన్‌ పేమెంట్‌, రిజిస్ట్రేషన్‌ చార్జీలు లేకుండా కేవలం చందా చెల్లించడం ద్వారా కస్టమర్‌ తనకు నచ్చిన కారును ఎంపిక చేసుకోవచ్చు. కారు డ్యామేజ్‌, రిపేర్లు, బీమా భారం అంతా కంపెనీదే. డ్రైవెన్‌ ప్రమోట్‌ చేస్తున్న కార్‌2డ్రైవ్‌ బెంగళూరులో కూడా సేవలు అందిస్తోంది. ఒక్కో కారు ఖరీదు రూ.1 కోటి పైనే ఉంటుందని డ్రైవెన్‌ ఎండీ అశ్విన్‌ జైన్‌ శుక్రవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘ప్రస్తుతం కంపెనీ వద్ద 145 లగ్జరీ కార్లున్నాయి. 500 సీసీ అపై సామర్థ్యమున్న సూపర్‌ ప్రీమియం 55 బైక్‌లు ఉన్నాయి’ అని వివరించారు.
కొత్తగా 3,000 వాహనాలు..
దీర్ఘకాలిక చందా, అద్దె విధానంలో కార్లను అందించేందుకు డ్రైవెన్‌ వచ్చే 12 నెలల్లో 3,000 కార్లను కొనుగోలు చేయనుంది. కస్టమర్‌ కోరిన మోడల్‌, ఫీచర్ల ఆధారంగా వాహనాన్ని అందజేస్తారు. ఈ విధానంలో రూ.3 లక్షల కారును సైతం వినియోగదారు ఎంచుకోవచ్చు. వాహనాల కొనుగోలుకు రూ.700 కోట్లు సమీకరించే పనిలో ఉన్నట్టు డ్రైవెన్‌ భాగస్వామి సయ్యద్‌ హుస్సేన్‌ వెల్లడించారు. ‘ఈ-వీ’ పేరుతో షేర్‌డ్‌ మొబిలిటీ సేవలను ఏప్రిల్‌లో ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. వచ్చే 18 నెలల్లో ఆరు నగరాల్లో 30,000 ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను ఇందుకోసం వినియోగిస్తామని పేర్కొన్నారు.You may be interested

పరిశోధన పత్రాల ప్రచురణ ఫ్రీ!

Saturday 30th March 2019

– రీసెర్చ్‌ స్కాలర్స్‌కు వేదిక రూబటోసిస్‌ పబ్లికేషన్‌ – ఫార్మా, మెడికల్, ఇంజనీరింగ్‌లో 50 జర్నల్స్‌ పబ్లిష్‌ – అన్నీ ఐఎస్‌బీఎన్, ఐఎస్‌ఎస్‌ఎన్, క్రాస్‌రెఫ్‌ అనుమతి పొందినవే హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రీసెర్చ్‌ స్కాలర్స్‌ పరిశోధన పత్రాలను ప్రచురణ చేయాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. విద్యార్థి దశలో అంత మొత్తం వెచ్చించడం కష్టమే! విద్యార్థిగా ఆ కష్టాలను అనుభవించారు కాబట్టే విష్ణు వర్ధన్‌ రెడ్డి, సయ్యద్‌ సల్మాన్‌లు.. తమ లాగా ఇతర విద్యార్థులకు ఇబ్బంది పడకూడదని

కన్జూమర్‌ రంగంలో మందగమనం!

Saturday 30th March 2019

గతంలో వినిమయ రంగం 20- 25 శాతం వృద్ది సాధించేదని, క్రమంగా ఆ స్వర్ణయుగం కరిగిపోతోందని ప్రముఖ కన్జూమర్‌ ఎకనమిస్టు రమా బిజాపుర్కార్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా నెలకొన్న సందిగ్ధతతో సాధారణ ప్రజలు కొనుగోళ్లు జరిపే మూడ్‌లో లేరన్నారు. కానీ కొన్ని అంశాల్లో మాత్రం వినిమయం కనిపిస్తూనే ఉందని, ఇందుకు ఉదాహరణ బయటకు వెళ్లి భోజనాలు చేయడమని చెప్పారు. వినిమయం నిరంతర ప్రక్రియని, దీనికి ముగింపు ఉండదని చెప్పారు. తరతరానికి

Most from this category