STOCKS

News


ఆర్థిక సంక్షోభంలో ‘‘ఎస్సెల్‌’’

Saturday 26th January 2019
Markets_main1548489419.png-23819

- నిధుల సమీకరణకు కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి
- 'జీ'లో వాటాలు విక్రయించనివ్వడం లేదు
- దెబ్బతీసిన ఇన్‌ఫ్రా పెట్టుబడులు,
కలిసిరాని వీడియోకాన్‌ డీ2హెచ్ కొనుగోలు
- రుణదాతలకు ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర లేఖ

ముంబై: ఎస్సెల్‌ గ్రూప్‌ తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోందంటూ వస్తున్న వార్తలపై గ్రూప్ చైర్మన్‌ సుభాష్ చంద్ర ఎట్టకేలకు పెదవి విప్పారు. కంపెనీ ఆర్థిక సంక్షోభంలో ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. దీన్నుంచి బైటపడే క్రమంలో కీలకమైన జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (జీఈఈఎల్‌)లో వాటాల విక్రయించి నిధులు సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. కొన్ని శక్తులు పడనివ్వడం లేదని ఆరోపించారు. ఇన్‌ఫ్రా పెట్టుబడులపై ఆశలు పెట్టుకున్నా ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం కారణంగా పరిస్థితి అదుపు తప్పిందని, వీడియోకాన్‌కి చెందిన డీ2హెచ్ వ్యాపారం కొనుగోలు కూడా కలిసి రాలేదని పేర్కొన్నారు. శుక్రవారం రుణదాతలకు రాసిన బహిరంగ లేఖలో సుభాష్ చంద్ర ఈ విషయాలు వెల్లడించారు.

తొందరపడితే మీకే నష్టం..
రుణదాతలకు క్షమాపణ చెప్పిన సుభాష్ చంద్ర .. జీఈఈఎల్‌లో వాటాల విక్రయం పూర్తయ్యే దాకా ఓపిక పట్టాలని కోరారు. అలా కాకుండా తొందరపాటుతనంతో వ్యవహరిస్తే.. రెండు వర్గాలూ నష్టపోక తప్పదని వ్యాఖ్యానించారు. అయితే, మొత్తం అప్పు ఎంత ఉన్నది, ఎగవేతలేమైనా జరిగాయా లాంటి అంశాలు ఆయన ప్రస్తావించలేదు. ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం అనంతరం రుణాల రోలోవర్‌ కష్టంగా మారిందని, అయితే డిసెంబర్‌ దాకా చెల్లింపులన్నీ సక్రమంగానే జరపగలిగామని పేర్కొన్నారు. "నా ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ బ్యాంకర్లు, ఎన్‌బీఎఫ్‌సీలు, మ్యూచువల్ ఫండ్స్ ఆశించినట్లుగా పనిచేయలేకపోయాయని నేను భావిస్తున్నాను. ఇందుకు గాను క్షమాపణలు చెబుతున్నాను. ఎవ్వరిదీ ఒక్క పైసా రుణం కూడా ఉంచుకోబోను. జీఈఈఎల్‌లో వాటాల విక్రయం పూర్తయితే అన్ని రుణాలను తీర్చేయగలుగుతాము. అప్పటిదాకా కాస్త ఓర్పు వహించండి. కానీ ఆందోళనతో, అరాచకంగా స్పందిస్తే దాని వల్ల మీరూ, మేమూ నష్టపోవాల్సి వస్తుంది" అని లేఖలో సుభాష్ చంద్ర పేర్కొన్నారు.

తప్పులు జరిగాయి..
గతేడాది జూన్‌ నుంచి సమస్యలు వెన్నాడుతున్నాయని, రుణదాతలు.. షేర్‌హోల్డర్లకు గుర్తుతెలియని శక్తులు లేఖలు రాస్తూ గందరగోళపరుస్తున్నాయని సుభాష్ చంద్ర చెప్పారు. తన వంతుగా కొన్ని తప్పులు కూడా జరిగాయని ఆయన తెలిపారు. ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా కారణ౾గా రూ. 4,000-5,000 కోట్ల మేర నష్టపోవాల్సి వచ్చిందన్నారు. అలాగే 2016 నవంబర్‌లో వీడియోకాన్ డీ2హెచ్ వ్యాపారం కొనుగోలుతో బోలెడంత నష్టపోయామని చెప్పారు. ఇక కుటుంబ వ్యాపార విభజన సమయంలో గ్రూప్ కంపెనీల రుణభారమంతా తమపైనే వేసుకోవడం మరో పెద్ద తప్పిదమని పేర్కొన్నారు.You may be interested

ఎల్‌అండ్‌టీ లాభం 37 శాతం జూమ్‌..

Saturday 26th January 2019

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇంజినీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) నికర లాభం 37 శాతం ఎగిసి రూ. 1,490 కోట్ల నుంచి రూ. 2,042 కోట్లకు చేరింది. అటు ఆదాయం 24 శాతం వృద్ధితో రూ. 28,747 కోట్ల నుంచి రూ. 35,709 కోట్లకు పెరిగింది. సమీక్షాకాలంలో కొత్తగా రూ. 42,233 కోట్ల ఆర్డర్లు దక్కించుకున్నట్లు సంస్థ సీఎఫ్‌వో ఆర్ శంకర రామన్

ఐదో ఆర్థిక శక్తిగా భారత్‌

Saturday 26th January 2019

- ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన - పెట్టుబడుల పురోగతికి నిరంతర చర్యలు - భారత్‌-దక్షిణాఫ్రికా వ్యాపార సదస్సులో ప్రసంగం న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించనుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశంలో పెట్టుబడుల పురోగతికి నిరంతర చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందనీ ఆయన వివరించారు. ఇండస్ట్రీ చాంబర్‌- సీఐఐ నిర్వహించిన భారత్‌-దక్షిణాఫ్రికా వాణిజ్య సదస్సును ఉద్దేశించి శుక్రవారం  ప్రధాని చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... - భారత్‌ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ.

Most from this category