News


విద్యార్థుల వసతి మార్కెట్‌లోకి రూ.700 కోట్లు

Saturday 8th June 2019
news_main1559979676.png-26176

  • 50 బిలియన్‌ డాలర్లను ఆకర్షించే సత్తా ఉంది
  • నైట్‌ఫ్రాంక్‌ సంస్థ నివేదికలో అంచనా

న్యూఢిల్లీ: దేశంలో విద్యార్థుల వసతుల (స్టూడెంట్‌ హాస్టల్‌) మార్కెట్‌ గతేడాది 100 మిలియన్‌ డాలర్ల (రూ.700కోట్లు) నిధులను ఆకర్షించినట్టు నైట్‌ఫ్రాంక్‌ సంస్థ తెలిపింది. ప్రస్తుత డిమాండ్‌, సరఫరా మధ్య అంతరాన్ని తొలగించేందుకు గాను ఈ విభాగానికి 50 బిలియన్‌ డాలర్ల (రూ.3.5 లక్షల కోట్లు) పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం ఉందని పేర్కొంది. ‘‘దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల పరిధిలో 3.4 కోట్ల మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. 3.4 కోట్ల మంది విద్యార్థుల్లో 70 శాతానికి పైగా 10 పెద్ద రాష్ట్రాలకు చెందిన వారు. ప్రస్తుతం భారత్‌లో 16 లక్షల విద్యార్థుల కోసం బెడ్లు (పడకలు) ఉన్నాయి. మొత్తం నమోదిత విద్యార్థుల సంఖ్యలో ఇది కేవలం 4 శాతమే. ఈ పడకల్లోనూ అధిక భాగం యూనివర్సిటీ వెలుపల ప్రైవేటు నిర్వహణలో ఉన్నవే. ఇవి పరిమిత ఆధునిక వసతులకు తోడు తక్కువ నాణ్యతతో కూడినవి’’ అని ‘గ్లోబల్‌ స్టూడెంట్‌ ప్రాపర్టీ- 2019’ నివేదిక పేరుతో నైట్‌ ఫ్రాంక్‌ విడుదల చేసిన నివేదిక తెలియజేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 లక్షల విద్యార్థుల వసతి డిమాండ్‌ ఉండగా, ఇది ఏటా 8 శాతం చొప్పున పెరిగి 2025 నాటికి 1.3 కోట్లకు చేరుతుందని నైట్‌ ఫ్రాంక్‌ తెలిపింది. 2018లో 100 మిలియన్‌ డాలర్లు ఈ విభాగంలో పెట్టుబడులుగా రాగా, డిమాండ్‌కు తగ్గట్టు విద్యార్థుల వసతులను ఏర్పాటు చేసేందుకు 50 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయని పేర్కొంది. ఒక్కో పడక ఏర్పాటుకు 6,250 డాలర్ల చొప్పున ఈ అంచనా వేసింది. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌నిఫ్టీ 57 పాయింట్లు అప్‌

Saturday 8th June 2019

ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ శుక్రవారం లాభాల్లో ముగిసింది. సింగపూర్‌లో నిన్న రాత్రి ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దాదాపు అరశాతం (57 పాయింట్లు) లాభంతో ముగిసింది. నిఫ్టీ -50 ఫ్యూచర్స్‌ ముగింపు(11900.75)తో పోలిస్తే 57 పాయింట్లు పెరిగి 11,956.00 వద్ద స్ధిరపడింది. శుక్రవారం దేశీయంగా సూచీలు నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులకు లోనై చివరికి స్వల్ప లాభంతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 39,616 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి

పావుగంటలో పాకెట్‌ మనీ!!

Saturday 8th June 2019

ఆధార్, స్టూడెంట్‌ ఐడీ సమర్పిస్తే చాలు విద్యార్థులకు రుణాలివ్వటమే ఎంపాకెట్‌ ప్రత్యేకత 5 లక్షల మంది యూజర్లు; ఏటా రూ.500 కోట్ల పంపిణీ త్వరలోనే కొత్త ఉద్యోగులకు పర్సనల్‌ లోన్స్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో ఎంపాకెట్‌ ఫౌండర్‌ గౌరవ్‌ జలాన్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఉద్యోగస్తులో లేదా వ్యాపారస్తులో... అది కూడా సిబిల్‌ స్కోర్‌ సరిగా ఉన్నవాళ్లకు మాత్రమే బ్యాంకులు క్రెడిట్‌ కార్డులు అందిస్తుంటాయి. మరి, చదువుకునే విద్యార్థులు లేదా అప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరిన యువత పరిస్థితేంటి?

Most from this category