ఐపీవోకు హెల్మెట్ తయారీ కంపెనీ ‘స్టడ్స్’
By Sakshi

హెల్మెట్ తయారీలో ప్రముఖ కంపెనీ అయిన స్టడ్స్ యాక్సెసరీస్ నిధుల సమీకరణకు ఐపీవో బాట పడుతోంది. ఐపీవోకు సంబంధించిన ముసాయిదా పత్రాలను సెబీ వద్ద దాఖలు చేసింది. ప్రమోటర్లు తమ వాటాల నుంచి 39.39 లక్షల షేర్లను ఐపీవోలో ఆఫర్ చేస్తుండగా, దీనికితోడు రూ.98 కోట్ల విలువైన షేర్లను తాజా ఈక్విటీ జారీ ద్వారా ఆఫర్ చేస్తోంది. స్టడ్స్ యాక్సెసరీస్ కేవలం హెల్మెట్లే కాకుండా ద్విచక్ర వాహన యాక్సెసరీల తయారీలోనూ కర్యాకలాపాలను నిర్వహిస్తోంది. ప్రమోటర్లు మధు భూషణ్ ఖురానా, సిద్దార్థ భూషణ్ ఖురానా, ఇతర వాటాదారులు కలిసి 39.39 లక్షల షేర్లను విక్రయించనున్నట్టు ముసాయిదా ఐపీవో పత్రాల ఆధారంగా తెలుస్తోంది. ఫరీదాబాద్‌లో హెల్మెట్లు, యాక్సెసరీలు, సైకిల్ హెల్మెట్ల తయారీ వసతుల కల్పనకు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఐపీవో నిధులను కంపెనీ వినియోగించనుంది. అంతేకాకుండా స్టాక్ ఎక్సేంజ్‌లలో నమోదు చేయడం వల్ల బ్రాండ్ ఇమేజ్ మెరుగుపడుతుందని కంపెనీ భావిస్తోంది. ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ ఈ ఐపీవో నిర్వహణ వ్యవహారాలు చూడనున్నాయి.
You may be interested
క్యాష్‌ఫ్లో, లాభం... ఏది ముఖ్యం?
Tuesday 28th August 2018ఆపరేటింగ్ క్యాష్‌ఫ్లో (నిర్వహణలో భాగంగా వచ్చి పోయే నగదు ప్రవాహం/ఓసీఎఫ్) అనేది ఓ కంపెనీ ఏ విధంగా పనిచేస్తుందన్నది తెలుసుకునేందుకు ముఖ్యమైన పారామీటర్‌గా నిపుణులు చెబుతుంటారు. ఆదాయంలో ఎంత మేర నగదుగా మార్చగలుగుతుందో ఇది తెలియజేస్తోంది. నిజానికి చాలా మంది ఇన్వెస్టర్లు ఓ కంపెనీలో పెట్టుబడికి నికర లాభాన్నే ప్రమాణికంగా చూస్తుంటారు. ఓసీఎఫ్ అన్నది ఏడాదికోసారే ప్రకటించేది కాగా, నికర లాభం ప్రతీ త్రైమాసికానికి వెలువడేది. కనుక ఎక్కువ మంది
రూపాయి పతనం... కంపెనీలకు పాజిటివ్?
Monday 27th August 2018నిఫ్టీ ఎర్నింగ్్స ఊపందుకుంటాయంటున్న నిపుణులు ఆటో, చమురు రిఫైనరీ రంగాలకు నెగిటివ్ డాలర్‌తో రూపాయి మారకం విలువ 70 స్థాయిల వద్ద కదలాడుతోంది. ఈ ఏడాది ఆసియా కరెన్సీల్లో రూపాయి అత్యధిక పతనం చవిచూసింది. రూపాయి గమనంతో ఆయా రంగాలకు చెందిన కంపెనీలపై ఎటువంటి ఫలితం ఉంటుందనే అంశంపై ప్రముఖ అనలిస్టులు వివిధ రకాల విశ్లేషణలు ఇస్తున్నారు. రూపాయి క్షీణతతో ఎగుమతిప్రధాన కంపెనీలకు మంచి ప్రయోజనం ఉంటుందని, డాలర్ డినామినేటెడ్ డెట్ ఉన్న