News


రుణగ్రహీతలకు అదనంగా 60 రోజుల గడువు

Friday 26th April 2019
Markets_main1556257788.png-25366

ఒత్తిడిలో ఉన్న రుణ ఆస్తులపై ఆర్‌బీఐ యోచన
న్యూఢిల్లీ: ఒత్తిడిలో ఉన్న రుణ ఆస్తుల పరిష్కారానికి సంబంధించి మార్గదర్శకాలను ఆర్‌బీఐ సవరించనుంది. రుణ చెల్లింపులకు అదనంగా 60 రోజుల గడువు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆర్‌బీఐ పరిశీలిస్తోంది. తద్వారా నిజాయితీగా నడిచే వ్యాపార సంస్థలకు ఇబ్బందులు రాకుండా చూడొచ్చని భావిస్తోంది. రుణ వాయిదాల చెల్లింపుల్లో ఒక్క రోజు విఫలమైన సరే వాటిని నిరర్థక ఆస్తులుగా (ఎన్‌పీఏలు) పరిగణించాలన్న ఆర్‌బీఐ 2018 ఫిబ్రవరి 12 నాటి ఆదేశాలను సుప్రీంకోర్టు ఇటీవలే కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిబంధనలను సవరించే పనికి ఆర్‌బీఐ శ్రీకారం చుట్టింది. త్వరలోనే నూతన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. గతేడాది తీసుకొచ్చిన ఆదేశాలను కొట్టివేయడంతో అంతకుముందు వరకు ఉన్న నిబంధనల ప్రకారం అయితే... ఓ రుణానికి సంబంధించి చెల్లింపులు 90 రోజుల పాటు జరగకపోతే ఆ ఖాతాను ఎన్‌పీఏగా గుర్తించాల్సి ఉంటుంది. అయితే, ఆర్‌బీఐ పలు ఆప్షన్లను తాజాగా పరిశీలిస్తోందని సమాచారం. అందులో భాగంగా ప్రస్తుత 90 రోజుల గడువుకు అదనంగా మరో 30-60 రోజుల సమయాన్ని కూడా ఇవ్వాలన్నది యోచన. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) వెసులుబాటు లభిస్తుందని ఆర్‌బీఐ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 



You may be interested

పసిడికి బలహీన గణాంకాల మద్దతు

Friday 26th April 2019

బలహీన అమెరికా ఆర్థిక గణాంకాల మద్దతుతో పసిడి ధర 4నెలల గరిష్టస్థాయి నుంచి క్రమంగా రివకరి బాట పట్టింది. ఆసియాలో శుక్రవారం ఔన్స్‌ పసిడి ధర 4డాలర్లు లాభపడి 1,284 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా నిన్న రాత్రి విడుదల చేసిన నిరుద్యోగ గణాంకాలు మార్కెట్‌ అంచనాల్ని అందుకోలేకపోగా, గతవారంలో అదనంగా 37,000 మంది ఉపాధి కోల్పోయినట్లు ప్రకటించింది. అలాగే  ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలరు ఇండెక్స్‌

ఎమ్‌సీఎక్స్‌ లాభం 78 శాతం అప్‌

Friday 26th April 2019

-సగటు రోజువారీ టర్నోవర్‌లో రికార్డ్‌ -రూ.111 కోట్లకు పెరిగిన ఆదాయం  న్యూఢిల్లీ: కమోడిటీ ఎక్స్చేంజ్‌ దిగ్గజం, ఎమ్‌సీఎక్స్‌ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో 78 శాతం ఎగసింది. 2017-18 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్లో రూ.34 కోట్లుగా ఉన్న నికర లాభం 2018-19 ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.61 కోట్లకు పెరిగిందని ఎమ్‌సీఎక్స్‌ తెలిపింది. ఆదాయం అధికంగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ

Most from this category