News


మొండిపద్దులంటే ఐసీయూ పేషెంట్లే!

Monday 10th June 2019
news_main1560162433.png-26207

పట్టించుకోకపోతే మరింత నష్టం 
ఎస్‌బీఐ చీఫ్‌ రజనీశ్‌ కుమార్‌
వ్యవస్థలో మొండిపద్దులు ఐసీయూలో పేషెంట్‌ లాంటివని ఎస్‌బీఐ చీఫ్‌ రజనీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. వాటిపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే అప్పుతీసుకున్నవాళ్లనే కాక, ఇచ్చిన సంస్థకు కూడా ఇక్కట్లు తెస్తాయన్నారు. ఫిబ్రవరి 12 సర్క్యులర్‌పై ఆర్‌బీఐ చేసిన తాజా సవరణలు అటు చిన్న, ఇటు పెద్ద బ్యాంకులకు సాయం చేస్తాయన్నారు. మొండిపద్దుల పరిష్కారానికి తీసుకువచ్చిన పాత నిబంధనలను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో తాజాగా ఆర్‌బీఐ కొత్త నియమావళిని శుక్రవారం ప్రకటించింది. ఇందులో భాగంగా మొండిపద్దును గుర్తించడానికి 30 రోజుల కాలపరిమితిని కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీలయినంత తొందరగా మొండిపద్దును గుర్తిస్తే వెంటనే రికవరీకి ఆస్కారం ఉంటుందని, ఎంత లేటు చేస్తే అంత నష్టం వస్తుందని రజనీశ్‌ చెప్పారు. 30రోజుల పరిమితి గడువును రుణదాతలు సరైన అర్దంలో తీసుకోవాలన్నారు. ఈ కాలపరిమితి కారణంగా వేగవంతమైన పరిష్కారాలు తీసుకునేందుకు వీలు చిక్కుతుందన్నారు. గతంలో రుణదాతలు(బ్యాంకులు) మధ్య ఉన్న ఇంటర్‌ క్రెడిటార్‌ ఒప్పందానికి ప్రస్తుతం నియంత్రణా పరమైన మద్దతు లభించిందని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. తాజాగా ఆర్‌బీఐ తెచ్చిన నిబంధనలు వెంటనే అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి 12 సర్క్యులర్‌ ఆధారంగా ఎన్‌సీఎల్‌టీకి వెళ్లిన వాళ్లు ఆయా కేసుల్లో రిఫరెన్సు తేదీని జూన్‌7గా మార్చుకోవాల్సిఉంటుందని కుమార్‌ చెప్పారు. త్వరలో రెపోరేట్‌ ఆధారిత హోమ్‌లోన్స్‌ను తీసుకువస్తామని ఎస్‌బీఐ ఇటీవల ప్రకటించింది. రాబోయే బడ్జెట్లో ఉపాధి కల్పనకు ఎక్కువ ఛాన్సులున్న టూరిజం, నిర్మాణం వంటి రంగాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని కుమార్‌ కోరారు. సాగు రంగానికి, ప్రైవేట్‌ పెట్టుబడుల జోరు పెంచేందుకు తగిన చర్యలు బడ్జెట్లో ఉండొచ్చన్నారు. You may be interested

11900పైన నిఫ్టీ ముగింపు

Monday 10th June 2019

ఆదుకున్న చివరి అరగంట కొనుగోళ్లు సూచీలు సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో భారీ లాభాలను నమోదు చేసుకున్నా...మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన అమ్మకాలు సూచీల లాభాల్నికొంతవరకూ  హరించివేశాయి. ఒకదశలో సూచీలు నష్టాల్లోకి మళ్లినప్పటికీ, చివరి అరగంటలో జరిగిన షార్ట్‌ కవరింగ్‌తో సెన్సెక్స్‌ 168 పాయింట్ల లాభంతో 39,784.52 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 11,922 వద్ద స్థిరపడ్డాయి. సూచీలకు ఇది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. ఐటీ, ఎఫ్‌ఎంజీసీ, ఫార్మా, రియల్టీ, అటో, మెటల్‌ షేర్లు

తీవ్ర హెచ్చుతగ్గులతో బ్యాంక్‌ నిఫ్టీ

Monday 10th June 2019

మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌తో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 500 పాయింట్ల రేంజ్‌లో ట్రేడైంది. నేడు మార్కెట్‌ లాభాల ప్రారంభంలో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 31,259.20 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో ఇండెక్స్‌ ఒకదశలో 300 పాయింట్ల లాభపడి 31,367.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం మార్కెట్లో నెలకొన్న కరెక‌్షన్‌తో ఇండెక్స్‌ మళ్లీ పతనబాట పట్టింది. ఇంట్రాడే గరిష్టం(31,367.40) నుంచి 506

Most from this category