STOCKS

News


మే నెలలో తగ్గిన వాహన విక్రయాలు

Tuesday 11th June 2019
news_main1560249271.png-26231

 గత ఏడాది మే నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది మే నెలలో వాహనాల విక్రయాలు  తగ్గాయని  సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చర్‌( సియామ్‌) మంగళవారం తెలిపింది.  ప్రయాణికుల వాహనాల దేశీయ విక్రయాలు 20.55శాతం తగ్గాయని, 2018 మే లో 3,01,238 యూనిట్లుగా ఉన్న ఈ అమ్మకాలు 2019 మే లో 2,39,347 యూనిట్లగా నమోదైందనట్లు  వివరించింది. సియామ్‌ విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశియంగా కార్ల అమ్మకాలు 26.03 శాతం తగ్గాయి. 2018 మే లో 1,99,479 యూనిట్ల విక్రయాలు జరగగా ఈ ఏడాది మే లో 1,47,546 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అదే విధంగా మోటర్‌ సైకిల్‌ అమ్మకాలలో 4.89 శాతం తగ్గుదల కనిపించింది. గతేడాది మే లో  12,22,164 యూనిట్లు ఉండగా , ఈ మే నెలలో 11, 62,373 యూనిట్లగా నమోదైంది. మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు గత ఏడాది మే నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది మే లో 6.73 శాతం తగ్గాయి. ఈ విక్రయాలు 18,50,698 యూనిట్ల నుంచి 17,26,206 యూనిట్లకు తగ్గాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 10.02 శాతం  మేర తగ్గాయి. అన్ని విభాగాల వాహనాల విక్రయాలు 8.62శాతం తగ్గినట్లు నమోదయ్యింది. గత ఏడాది మే లో 22,83,262 యూనిట్లుగా ఉన్న విక్రయాలు ఈ ఏడాది మే లో 20,86,358 యూనిట్లకు మాత్రమే పరిమితమయ్యాయి.



You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొత్తగా 5.5 లక్షల ఫోలియోలు

Tuesday 11th June 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలో మే నెలలోనూ నూతన పెట్టుబడి ఖాతాలు (ఫోలియోలు) పెరుగుదలను నమోదు చేశాయి. మే నెలలో ఏఎంసీలు 5.54 లక్షల నూతన ఫోలియోలను ప్రారంభించాయి. దీంతో అన్ని ఏఎంసీల పరిధిలో ఫోలియోల సంఖ్య 8.32 లక్షలకు పెరిగినట్టు యాంఫి గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.   క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌, ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల ఖాతాలు తగ్గడం గమనించాల్సిన అంశం. కొన్ని కార్పొరేట్‌ సంస్థలు (జీ గ్రూపు, అడాగ్‌ గ్రూపు, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌

మూడోరోజూ లాభాలే..!

Tuesday 11th June 2019

సానుకూల జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ మార్కెట్‌ వరుసగా మూడోరోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 166  పాయింట్లు పెరిగి 39,950.46 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల పెరిగి 11,965.60 వద్ద ముగిశాయి. బ్యాంకింగ్‌, మెటల్‌, మీడియా, అటో, ఫైనాన్స్‌, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 231 పాయింట్లు(0.75శాతం) లాభపడి 31,265.45 వద్ద స్థిరపడింది. మరోవైపు

Most from this category