News


ఆగిపోయిన ఫియట్‌ క్రిస్లర్‌, రెనోల విలీనం

Friday 7th June 2019
news_main1559889987.png-26154

పారిస్: ప్రముఖ వాహన తయారీ కంపెనీలైన ఫియట్‌ క్రిస్లర్‌, రెనో సంస్థల మధ్య విలీన ఒప్పందం వీగిపోయింది. ఫ్రాన్స్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీలిన ప్రతిపాదనను తిర‌స్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఫియట్‌ క్రిస్లర్‌ గురువారం ప్రకటించింది. గతనెల్లో ఈ అంశంపై చర్చించేందుకు ఫ్రాన్స్‌లోని రెనో ప్రధానకార్యాలయంలో ఇరు కంపెనీల బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు సమావేశమై.. తుది నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, రాజకీయ పరిస్థితులు ఇందుకు సహకరించడం లేదనే నేపంతో డీల్‌ను నిలిపివేశాయి. 



You may be interested

బైజూస్‌ నుంచి ఎర్లీ లెర్న్‌యాప్‌

Friday 7th June 2019

బెంగళూరు: ఆన్‌లైన్‌ విద్యలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన బైజూస్‌... తాజాగా ఎర్లీ లెర్న్‌ యాప్‌ను విడుదల చేసింది. 6-8 ఏళ్ల వయసు గ్రూపులోని  (1-3 తరగతులు) వారి కోసం ఈ యాప్‌ను రూపొందించినట్టు థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (బైజూస్‌ మాతృ సంస్థ) తెలిపింది. డిస్నీ కథలు, క్యారక్టర్లతో అలరిస్తూ  విద్యార్థుల కోసం ఉద్దేశించిన వ్యక్తిగత ప్రొగ్రామ్‌లను ఈ యాప్‌ ద్వారా ఆఫర్‌ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ యాప్‌లో

నాట్కో కొత్తూరు యూనిట్‌లో ఉల్లంఘనలు

Friday 7th June 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ నాట్కో ఫార్మాకు చెందిన కొత్తూరులోని ఫార్ములేషన్‌ యూనిట్‌లో యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు చేపట్టింది. మే 30 నుంచి జూన్‌ 5 వరకు జరిగిన ఈ తనిఖీల్లో తయారీ కేంద్రంలో పలు ఉల్లంఘనలు జరిగినట్టు ఎఫ్‌డీఏ అధికారులు గుర్తించారు. ఈ మేరకు తొమ్మిది అంశాలను లేవనెత్తుతూ ఫెడరల్‌ ఫుడ్‌, డ్రగ్‌, కాస్మెటిక్‌ యాక్టు కింద కంపెనీకి ఫామ్‌-483 జారీ చేశారు. ఎఫ్‌డీఏ లేవనెత్తిన అంశాలకు

Most from this category