News


రంగాల వారీగా ఎక్స్‌పోజర్‌పై ఎస్‌బీఐ సమీక్ష

Saturday 29th September 2018
news_main1538200967.png-20693

కోల్‌కతా: ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ, వివిధ రంగాల వారీగా క్రెడిట్‌ ఎక్స్‌పోజర్‌కు సంబంధించి మధ్యంతర సమీక్ష నిర్వహించనుంది. ఓ రుణానికి సంబంధించి డిఫాల్ట్‌ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి?, దాన్ని మంజూరు చేయాలా? లేదా అన్నది ఈ సమీక్షలో నిర్ణయించడం జరుగుతుందని ఎస్‌బీఐ ఎండీ దినేష్‌ ఖరా చెప్పారు. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. బ్యాంకు రుణాల్లో కార్పొరేట్‌ రంగానికి ఇచ్చినవి ప్రస్తుతం 40 శాతంగా ఉండగా, రిటైల్‌ రుణాల వాటా 57 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రుణ వృద్ధి 10 శాతం, డిపాజిట్ల వృద్ధి 15-16 శాతంగా ఉంటుందని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది. బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు 8 శాతం, నికర ఎన్‌పీఏలు 5 శాతంగా ఉన్నట్టు ఖరా చెప్పారు. ఎన్‌పీఏల ధోరణి తగ్గుముఖం పడుతోందన్నారు. ఇప్పటికే వాటికి తగినన్ని నిధులను కేటాయించినట్టు చెప్పారు. 



You may be interested

ఐపీఓకు మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌

Saturday 29th September 2018

న్యూఢిల్లీ: డయాగ్నస్టిక్స్‌ కంపెనీ మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రానుంది.  ఐపీఓ సంబంధిత పత్రాలను ఈ కంపెనీ ఇటీవలే మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ 1.52 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు, భాగస్వాములకు చెందిన 1.52 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో విక్రయిస్తారు. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,500

ఈ షేర్లు వజ్రాల్లాంటివి

Saturday 29th September 2018

ముంబై: యస్‌బ్యాంక్‌ షేర్లు వజ్రాల్లాంటివని ఆ బ్యాంక్‌ సీఈఓ రాణా కపూర్‌ వ్యాఖ్యానించారు. యస్‌బ్యాంక్‌లో తనకున్న వాటాను విక్రయించబోనని స్పష్టంచేశారు. ఎమ్‌డీ, సీఈఓగా ఈ బ్యాంక్‌ నుంచి వైదొలిగినప్పటికీ, ఎప్పటికీ, ఈ షేర్లను అమ్మే ప్రశ్నే లేదని ఆయన ట్వీట్‌ చేశారు.  ఈ షేర్లు అమూల్యం... రాణా కపూర్‌ పదవీ కాలాన్ని ఆర్‌బీఐ కుదించిన నేపథ్యంలో గత ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో యస్‌బ్యాంక్‌  షేర్‌ భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ‘‘యస్‌బ్యాంకులో ప్రమోటర్‌గా

Most from this category