STOCKS

News


ఎన్‌బీఐతో ఎస్‌బీఐ ఒప్పందం

Thursday 11th October 2018
Markets_main1539232288.png-21042

ముంబై: ఖాట్మండు నేషనల్‌ బ్యాంకింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌బీఐ)తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేసినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. మౌలిక , పరిపాలనా సదుపాయాలను ఇరు సంస్థలు వినియోగించుకునేందుకు ఈ ఎంఓయూ వీలు కల్పిస్తుందని వివరించింది. బ్యాంకింగ్‌ రంగంలో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మానవ వనరులను సమకూర్చడం కోసం వ్యూహాత్మక కూటమి ఏర్పాటు ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని పేర్కొంది.



You may be interested

రెండు వారాల కనిష్టానికి ముడిచమురు ధర

Thursday 11th October 2018

అంతర్జాతీయంగా ముడిచమురు ధర గురువారం రెండువారాల కనిష్టానికి చేరుకుంది. గతరాత్రి అమెరికా మార్కెట్లో 2.25శాతం నష్టపోయిన చమురు ధర గురువారం ట్రేడింగ్‌లో మరింత నష్టపోయింది. ప్రపంచమార్కెట్లో నేడు బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ఫ్యూచర్‌ ధర 1.77 శాతం నష్టపోయి 81.60డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి ఇంట్రాడేలో 1.72 డాలర్ల వరకు నష్టపోయి 81.37డాలర్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఇది చమురు ధరకు రెండువారాల కనిష్టస్థాయి. అమెరికా

ట్రాన్స్‌ట్రాయ్‌ దివాలా ప్రక్రియకు అనుమతి

Thursday 11th October 2018

సాక్షి, హైదరాబాద్‌ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ సభ్యులు రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌ దివాలా ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ అనుమతినిచ్చింది. కెనరా బ్యాంకు నుంచి తీసుకున్న రూ.489.77 కోట్లు చెల్లించకుండా ఎగవేసినందుకు ఎన్‌సీఎల్‌టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తాత్కాలిక దివాలా పరిష్కార నిపుణుడిగా (ఆర్‌పీ) హైదరాబాద్‌కు చెందిన గోవిందరాజుల వెంకట నర్సింహారావును నియమించింది. ట్రాన్స్‌ట్రాయ్‌ దివాలా ప్రక్రియకు సంబంధించి

Most from this category