STOCKS

News


పల్సస్‌ ఎండీ శ్రీనుబాబుకు అవార్డు

Thursday 27th December 2018
news_main1545884419.png-23256

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వైద్య, ఆరోగ్య, సామాజిక రంగాల్లో అందిస్తున్న సేవలకు గాను పల్సస్‌ సీఈఓ, ఎండీ డాక్టర్‌ గేదెల శ్రీనుబాబుకు చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ అవార్డు దక్కింది. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడి చేతుల మీదుగా శ్రీనుబాబు ఈ అవార్డును అందుకున్నారు. పల్సస్‌ సంస్థ... ఒమిక్స్‌ ఇంటర్నేషనల్‌ ద్వారా  హెల్త్‌ కేర్‌ రంగానికి సంబంధించి ఓపెన్‌ యాక్సెస్‌ జర్నల్స్‌ను ప్రచురిస్తోంది. విదేశాలతో పాటు హైదరాబాద్, చెన్నై, గుర్గావ్, విశాఖపట్నం ప్రాంతాల్లో సంస్థకు కార్యాలయాలున్నాయి.



You may be interested

తగ్గిన రూపాయి

Thursday 27th December 2018

ప్రపంచ మార్కెట్లో క్రూడ్‌ ధర 8 శాతం పెరిగిన కారణంగా గురువారం రూపాయి బలహీనపడింది. ముంబైలోని ఇం‍టర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభంలో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి 18 పైసల మేర తగ్గి 70.25 స్థాయి వద్దకు దిగింది. ఇటీవల క్రూడ్‌ ధరలు పతనమైన నేపథ్యంలో రూపాయి 69.70 వరకూ ర్యాలీ జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా 70.21 వద్ద ప్రారంభమైన రూపాయి 70.27 కనిష్టస్థాయికి పడిపోయి, ఉదయం

బ్యాంకుల్లో మోసాల నివారణకు సీవీసీ చర్యలు

Thursday 27th December 2018

ఆడిట్‌ నివేదికల తనిఖీ దిద్దుబాటు చర్యల సూచన న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా కంపెనీల్లో మోసాల నివారణకు కేంద్ర స్థాయిలో అవినీతి నిరోధక సంస్థ సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) రంగంలోకి దిగింది. ఆయా సంస్థల ఆడిట్‌ నివేదికలను తనిఖీ చేయడంతోపాటు మోసాల నివారణకు దిద్దుబాటు చర్యలను కూడా సూచించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు పెద్ద ఎత్తున మోసాల ఘటనలను రిపోర్ట్‌ చేస్తుండడం, మొండి బకాయిలు భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో సీవీసీ

Most from this category