STOCKS

News


​‍శ్రేయీ ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌ లాభం రూ.111 కోట్లు

Saturday 17th November 2018
news_main1542432991.png-22129

కోల్‌కత: శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 29 శాతం ఎగసింది. గత క్యూ2లో రూ.86 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.111 కోట్లకు పెరిగిందని శ్రేయీ ఇన్‌ఫ్రా తెలియజేసింది. వడ్డీ ఆదాయం పెద్దగా మార్పు లేకుండా రూ.1,019 కోట్లకు చేరిందని, స్టాండ్‌ అలోన్‌ పరంగా చూస్తే, వడ్డీ ఆదాయం తగ్గిందని తెలియజేసింది. గత క్యూ2లో రూ.432 కోట్లుగా ఉన్న వడ్డీ ఆదాయం రూ.351 కోట్లకు తగ్గిందని పేర్కొంది. కంపెనీ సీఈఓగా రాకేశ్‌ భుటోరియా నియమితులయ్యారు. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది.



You may be interested

‘అటల్‌ పెన్షన్‌’ను ప్రభుత్వ పథకం మాదిరే చూడాలి

Saturday 17th November 2018

న్యూఢిల్లీ: అటల్‌ పెన్షన్‌ యోజనను ఇతర ప్రభుత్వ ప్రయోజన పథకాల్లానే చూడాలని, ఆధార్‌తో అనుసంధానానికి అవకాశం కల్పించాలని యూఐడీఏఐని చైర్మన్‌ హేమంత్‌ జి కాంట్రాక్టర్‌ కోరారు. అటల్‌ పెన్షన్‌ పథకానికి ప్రభుత్వ హామీ ఉందని, ప్రభుత్వ ప్రయోజనమనే అర్థం పరిధిలోకి వస్తుందని చెప్పారాయన. ఆధార్‌ వినియోగం విషయమై సుప్రీంకోర్టు అన్ని ప్రభుత్వ పథకాలకు మినహాయింపు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

తగ్గిన విదేశీ మారక నిల్వలు

Saturday 17th November 2018

ముంబై: విదేశీ మారక నిల్వలు నవంబర్‌ 9తో ముగిసిన వారానికి 393.01 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. అంటే ఆ వారంలో 121.2 మిలియన్‌ డాలర్ల మేర తగ్గుముఖం పట్టాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు మొత్తం మీద 103.2 మిలియన్‌ డాలర్ల మేర తగ్గి 368.035 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. బంగారం నిల్వలు 20.888 బిలియన్‌ డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. 

Most from this category