STOCKS

News


హైదరాబాద్‌లో ఫెనటిక్స్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌

Wednesday 19th September 2018
Markets_main1537338639.png-20374

లైసెన్స్‌డ్‌ స్పోర్ట్స్‌ మర్చండైస్‌ విక్రయంలో ఉన్న ఫెనటిక్స్‌ భారత్‌లో టెక్నాలజీ ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.  హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ వద్ద దీనిని నెలకొల్పింది. సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ నుంచి గతేడాది పొందిన సుమారు రూ.6,500 కోట్ల పెట్టుబడితో చేపట్టిన విస్తరణలో భాగంగానే భారత్‌లో ప్రవేశించామని చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మ్యాట్‌ మాడ్రిగల్‌ తెలిపారు. కంపెనీ ప్రతినిధులు రమణ తూము, సతీష్‌ ఉమాలే, జాన్‌ బెయిలీతో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నిపుణులైన మానవ వనరులు ఉన్నారని గుర్తు చేశారు. ఈ కేంద్రం సాంకేతికంగా సంస్థకు మద్దతు ఇస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు 6,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని వివరించారు. కంపెనీ ఏటా రూ.14,000 కోట్ల టర్నోవరు నమోదు చేస్తోంది.



You may be interested

టెలికం నుంచి ఆర్‌కామ్ నిష్క్రమణ

Wednesday 19th September 2018

ఇక రియల్టీ వ్యాపారంపైనే దృష్టి ఏజీఎంలో చైర్మన్ అనిల్‌ అంబానీ వెల్లడి ముంబై: ఒకప్పుడు టెలికం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) మొత్తానికి ఆ వ్యాపారం నుంచే పూర్తిగా వైదొలగనుంది. ఇకపై భవిష్యత్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. మంగళవారం జరిగిన ఆర్‌కామ్‌ 14వ వార్షిక సాధారణ సమావేశంలో .. రిలయన్స్‌ గ్రూప్‌ (అడాగ్‌) చైర్మన్‌ అనిల్‌ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. అన్నింటికన్నా ముందుగా ఆర్‌కామ్‌కు

మొండిబకాయిల విక్రయంలో ఎస్‌బీఐలు

Wednesday 19th September 2018

8 ఎన్‌పీఏల విక్రయానికి బిడ్ల ఆహ్వానం విలువ సుమారు రూ. 3,900 కోట్లు న్యూఢిల్లీ:- సుమారు రూ. 3,900 కోట్ల మేర మొండిబాకీలను రాబట్టుకునే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరో 8 నిరర్ధక ఆస్తులను (ఎన్‌పీఏ) విక్రయించనుంది. ఇందుకోసం అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలు (ఏఆర్‌సీ), ఆర్థిక సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఎనిమిది ఖాతాల్లో అత్యధికంగా కోల్‌కతాకు చెందిన రోహిత్ ఫెరో టెక్‌

Most from this category